ఎన్టీఆర్‌కు జోడీగా ఇస్మార్ట్ పోరి..!!

June 22, 2020 at 3:58 pm

నభా నటేష్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ హీరోగా వ‌చ్చిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో నభా నటేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో హాట్ అండ్ మాస్ హీరోయిన్ న‌భా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది న‌భా న‌టేష్‌. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అద్భుత అవకాశం ఆమె తలుపు తట్టినట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్ సినిమా `ఆర్ఆర్ఆర్` నటిస్తున్నాడు. ఈ సినిమాతో త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కోసం నభాను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఇస్మార్ట్ శంకర్‌లో సినిమాలో తెలంగాణ అమ్మాయి పాత్రలో నటించి మెప్పించిన తీరు ఎవరు మరిచిపోలేదు. అందుకే ఈ సినిమాలో మరోసారి కథను కీలక మలుపు తిప్పే తెలంగాణ అమ్మాయి పాత్రలో నభా నటేష్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. మరి, ఇదే నిజమైతే నభాను అదృష్టం వరించినట్టే అవుతుంది. కాగా, ఈ సినిమాను కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్‌కు జోడీగా ఇస్మార్ట్ పోరి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts