ఆస‌క్తి రేకెత్తిస్తోన్న అల్ల‌రి న‌రేష్‌ ‘నాంది’ టీజ‌ర్‌..!!

June 30, 2020 at 12:04 pm

అల్లరి నరేష్.. త్వ‌ర‌లోనే ‘నాందీ’ సినిమాతో పలకరించబోతున్నాడు. నరేష్‌కు ఇది 57వ చిత్రం. రెగ్యూలర్‌గా కామెడీ బేస్ చిత్రాలు చేసే నరేష్ తన పంథా మార్చుకొని తొలిసారి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేసున్నాడు. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స‌తీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా తలకిందులుగా వేలాడుతూ ఫస్ట్ లుక్‌తో సర్ ప్రైజ్ చేశారు అల్లరి నరేష్.

ఇక నేడు నరేష్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టీజర్ విడుద‌ల‌ చేశారు. ఈ టీజ‌ర్‌ను హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్‌ చేసి చిత్ర యూనిట్‌ను అభినంద‌న‌లు తెలిపారు అయితే ఇప్ప‌టి వ‌ర‌కు న‌రేశ్ చేసిన చిత్రాల‌న్నింటిలో ఈ సినిమా డిఫ‌రెంట్ అని టీజ‌ర్‌ను చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. `దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 2015 నాటికి 1401 జైళ్లు ఉంటే 366781 మంది ఖైదీలు రకరకాలుగా శిక్షలు అనుభవిస్తున్నారు. అందులో దాదాపుగా 250000 మంది తప్పు చేశామో చేయలేదో తెలియకుండానే అండర్ ట్రయిల్ కింద శిక్ష అనుభవిస్తున్నారు` అని డైరెక్టర్ హరీష్ శంకర్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది.

అయితే అస‌లు న‌రేశ్‌ను ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు? అనే విష‌యాన్ని టీజ‌ర్‌లో చూపించ‌లేదు కానీ.. న‌రేశ్ చేయ‌ని నేరానికి అరెస్ట్ అయ్యి.. పోలీసులు ద‌గ్గ‌ర చావు దెబ్బలు తిన‌డాన్ని టీజ‌ర్‌లో చూసిస్తూ.. ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తించారు. ఇక టీజర్ చివరలో నరేష్‌ చెప్పిన డైలాగ్ కూడా ఎంతగానో ఆలోచింపజేస్తోంది. ‘ఒక మనిషి పుట్టడానికి 9 నెలలే టైమ్ పడుతుంది. కానీ నాకు న్యాయం చేప్పడానికేంటి సర్..ఇన్ని సంవత్సరాలు పడుతోంది..’ అని అల్లరి నరేశ్ స్ట్రాంగ్ లైన్ తో సినిమాపై అంచనాల డోస్ పెంచేశాడు.

ఆస‌క్తి రేకెత్తిస్తోన్న అల్ల‌రి న‌రేష్‌ ‘నాంది’ టీజ‌ర్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts