`సర్కారు వారి పాట`లో సెకెండ్ హీరోయిన్‌గా ర‌జ‌నీకాంత్ కూతురు..??

June 27, 2020 at 11:26 am

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు `స‌రిలేరు నీకెవ్వ‌రూ` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత.. పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే టైటిల్ లుక్ రిలీజ్ చేసి అంచనాలను రెట్టింపు చేశారు. ముఖ్యంగా మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలు కానుందని సమాచారం.

ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కీర్తి స్వయంగా వెల్లడించింది. అయితే ఈ చిత్రంసెకండ్ హీరోయిన్ కి కూడా అవకాశం ఉందట. ఈ క్ర‌మంలోనే ఓ కీలక పాత్ర కోసం ర‌జ‌నీకాంత్ కూతురును ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది.

వెయిట్‌.. వెయిట్‌.. ర‌జ‌నీకాంత్ కూతురు అంటే రియ‌ల్ కూతురు కాదండోయ్‌.. రీల్ కూతురు. అదేనండీ, నివేద థామస్. దర్బార్ సినిమాలో రజనీకాంత్ కుమార్తెగా న‌టించిన నివేద థామ‌స్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు వకీల్ సాబ్ లో పవన్ కల్యాణ్ సరసన నటిస్తోంది. అయితే ఇదే స‌మ‌యంలో నివేద మ‌హేష్ సినిమాలో కూడా మంచి ఆఫ‌ర్ ప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. సర్కారు వారి పాట’ చిత్రంలో ఓ కీలక పాత్రకు ఆమెను తీసుకున్నారన్నది తాజా వార్త. మ‌రి దీనిపై అధికార ప్రకటన రావలసి ఉంది.

`సర్కారు వారి పాట`లో సెకెండ్ హీరోయిన్‌గా ర‌జ‌నీకాంత్ కూతురు..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts