బాల‌య్య‌కు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే విషెస్‌.. ఎలా చెప్పాడో తెలుసా..?

June 10, 2020 at 8:33 am

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సినిమాలతో ఎన్నో రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నేడు 60వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. నందమూరి తారకరామారావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి శత చిత్ర కథానాయకుడు అనిపించుకున్న తొలి నట వారసుడుగా రికార్డులకు ఎక్కాడు ఈ నంద‌మూరి అంద‌గాడు. ఇక అటు సినిమాలు.. ఇటు రాజకీయం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు బాల‌య్య‌.

1960 జూన్ 10న నందమూరి బసవ తారకం, నందమూరి తారక రామారావు ఎనిమిదో సంతానంగా జన్మించిన బాలకృష్ణ. ఎన్టీఆర్‌ దంపతులకు ఆరో కొడుకు. ఇక నేడు ఆయన పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నంద‌మూరి చిన్నోడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. బాల‌కృష్ణ‌కు త‌న‌దైన శైలిలో సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలిపారు.

`నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు బాబాయ్‌. జై బాలయ్య !` అంటూ ఫేస్‌బుక్ ద్వారా విషెస్ తెలిపారు. ఈ క్ర‌మంలోనే బాల‌కృష్ణ రేర్ ఫోటోను పోస్ట్ చేశాడు ఎన్టీఆర్. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

బాల‌య్య‌కు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే విషెస్‌.. ఎలా చెప్పాడో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts