ఫ్యాన్స్ కోసం చెమటోడుస్తున్న తారక్!

June 5, 2020 at 10:25 am

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచానలు ఆకాశానికి చేరుకున్నాయి.

అయితే తారక్ తన ఫ్యాన్స్ కోసం మరో రెండేళ్ల పాటు చెమటలు చిందించనున్నాడు. 2019లో తారక్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. పోనీ 2020లోనైనా వస్తుందనుకుంటే ఈయేడు కూడా తారక్ సినిమా లేదని ఆర్ఆర్ఆర్ తేల్చేసింది. దీంతో తారక్ ఫ్యాన్స్ రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే 2021లో మాత్రం తారక్ వారి కోసం డబుల్ బొనాన్జా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్న తారక్, అదే ఏడాది చివర్లో త్రివిక్రమ్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

ఇక 2022లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రాబోయే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. మొత్తానికి రెండేళ్లపాటు తారక్ చాలా బిజీగా ఉండనున్నాడు. తన అభిమానుల కోసం గ్యాప్ లేకుండా కష్టపడుతున్న తారక్‌ను చూసి ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ కోసం చెమటోడుస్తున్న తారక్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts