ఆర్ఆర్ఆర్ కూడా కాపీయేనా.. జక్కన్న దెబ్బకు భయపడుతున్న తారక్ ఫ్యాన్స్!

June 10, 2020 at 9:17 am

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తు్న్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు పీక్స్‌కు చేరాయి.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. కాగా వీరిద్దరి పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడు జక్కన్న. అయితే చరణ్‌కు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోండగా, తారక్‌కు జోడిగా ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్ నటిస్తోంది. దీంతో ఈ సినిమాలో తారక్ లవ్‌ట్రాక్‌పై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.

కాగా ఈ సినిమాలో తారక్-ఒలివియా మారిస్ లవ్‌ట్రాక్‌ను జక్కన్న ఓ బాలీవుడ్ మూవీని కాపీ చేసి మక్కీకి మక్కీ దించేయనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లగాన్ చిత్రంలో హీరోను ఓ బ్రిటిష్ యువరాణి ప్రేమిస్తుంది. అతడు బ్రిటిష్ వారితో క్రికెట్ పోటీలో గెలిచేందుకు తనకు తోచిన సాయం చేస్తుంది. కానీ వన్-సైడ్ లవ్ కావడంతో, ఆమె తన ప్రేమలో ఫెయిల్ అయ్యి తిరిగి వెళ్లిపోతుంది. ఇప్పుడు తారక్-ఒలివియాల మధ్య లవ్‌ట్రాక్ కూడా సేమ్ టు సేమ్ లగాన్ సినిమాలో లాగే ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే పలు సినిమాలను కాపీ చేశాడంటూ రాజమౌళిపై వస్తున్న కామెంట్స్‌కు మరింత బలం చేకూరేలా ఈ లవ్ ట్రాక్ ఉండనుండటంతో ఎన్టీఆర్ అభిమానుల్లో భయం మొదలైంది. ఈ లవ్ ట్రాక్ సినిమాకు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందా అని వారు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఆర్ఆర్ఆర్ కూడా కాపీయేనా.. జక్కన్న దెబ్బకు భయపడుతున్న తారక్ ఫ్యాన్స్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts