కేజీఎఫ్‌ను మించిన టైటిల్.. తారక్ అంటే ఆ మాత్రం ఉంటుందిగా!

June 10, 2020 at 9:58 am

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తారక్ మరోసారి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా పూర్తి కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా ప్రారంభించారు చిత్ర యూనిట్. ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే, తారక్ మరో సినిమాను లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తనలోని ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, తన నెక్ట్స్ మూవీని తారక్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు అదిరిపోయే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని ఆయన చూస్తున్నాడు. కాగా ఎన్టీఆర్ పుట్టినరోజున రేడియేషన్ అనే పదాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్, చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ వాడటంతో, ఈ సినిమాకు అదే టైటిల్ ఉండనుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకు రేడియేషన్ కాకుండా న్యూక్లియర్, మిస్సైల్ అనే రెండు టైటిళ్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారట. మొత్తానికి ఈ సినిమాలో తారక్ విధ్వంసాన్ని సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. మరి తారక్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

కేజీఎఫ్‌ను మించిన టైటిల్.. తారక్ అంటే ఆ మాత్రం ఉంటుందిగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts