`వ‌కీల్‌సాబ్` నుంచి కీలక పోస్టర్ లీక్‌.. షాక్‌లో చిత్ర‌యూనిట్‌..!!

June 29, 2020 at 12:55 pm

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ పవన్‌ కల్యాణ్.. దాదాపు రెండేళ్ల త‌ర్వాత న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అంజ‌లి, నివేదా థామ‌స్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుద‌లై ఇంట‌ర్నెట్‌ని షేక్ చేసింది. టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగింది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే ఆగ‌స్ట్‌లో సినిమా షూటింగ్ మొద‌ల‌య్యేలానే క‌న‌ప‌డుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు కూడా లీకుల బెడద పట్టుకుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం సమయంలో పవన్ లుక్ బయటకు వచ్చి అది వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని మ‌రో లుక్ కూడా బయటకు వచ్చింది.

సినిమాలో కీల‌క‌మైన ఇన్‌టెన్స్ కోర్ట్ సీన్.. అందులో ప‌వ‌న్‌క‌ల్యాణ్, అంజ‌లి ఉన్న ఫొటో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. వ‌కీల్‌సాబ్ నుంచి కీలక ఫోటో లీక్ అవ్వ‌డంతో చిత్ర‌యూనిట్ షాక్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ లీకుల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌టానికి నిర్మాత‌లు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

`వ‌కీల్‌సాబ్` నుంచి కీలక పోస్టర్ లీక్‌.. షాక్‌లో చిత్ర‌యూనిట్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts