కరోనా కనపడని శత్రువు: మోడీ

June 1, 2020 at 12:11 pm

కరోనా వైరస్ అనేది కనపడని శత్రువు అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన జాతిని ఉద్దేశించి కాసేపటి క్రితం మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. మన వైద్యులు కరోనా వైరస్ ని జయిస్తారని ఈ సందర్భంగా మోడీ అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కరోనా వైరస్ ని జయిస్తారని మోడీ ఈ సందర్భంగా అన్నారు. కరోనా పై అవిశ్రాంతంగా వైద్య సిబ్బంది పోరాటం చేస్తున్నారని చెప్పారు.

కరోనాపై పోరులో భారత్ చాలా ముందు ఉందని అన్నారు. మన దేశం ప్రపంచానికి కరోనా విషయంలో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కరోనా నియంత్రణ లో వైద్యుల పాత్ర చాలా కీలకమని అన్నారు మోడీ. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక కాసేపట్లో కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర సర్కార్ తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా మారింది.

లాక్ డౌన్ సహా కరోనా నియంత్రణ పై చర్యలను మోడీ కేబినేట్ మంత్రులతో చర్చిస్తారు. అదే విధంగా 20 లక్షల కోట్ల ప్యాకేజి విషయంలో కూడా ఆయన మంత్రులతో మాట్లాడి ఆ తర్వాత కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినేట్ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రాలకు కరోన విషయంలో మరింత స్వేచ్చ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు పలువురు.

కరోనా కనపడని శత్రువు: మోడీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts