ఆ ఐదు `ఐ`లపై దృష్టి పెట్టిన మోదీ.. ఎందుకంటే..?

June 2, 2020 at 12:26 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచవ్యాప్తంగా ఏ స్థాయిలో విజృంభిస్తుందో రోజు చూస్తూనే ఉన్నాం. చైనాలో గ‌త ఏడాది డిసెంబ‌రులో పుట్టుకొచ్చిన ఈ కొత్త ర‌కం వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తిచెందింది. భార‌త్‌లోనూ క‌రోనా రోజురోజుకు విస్త‌రిస్తోంది. ప్ర‌స్తుతం భార‌త్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువగా వస్తున్నాయి. అలాగే ఐదు వేల‌కు పైగా క‌రోనా సోకి మ‌ర‌ణించారు. అయితే క‌రోనా వైరస్ కారణంగా కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసింది. ఆర్థిక ప్యాకేజీ ప్రకటన అనంతరం ప్రధాని తొలిసారిగా ప్రసంగించారు.

భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) 122వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. లాక్ డౌన్ అన్ లాక్ మొదటి దశ ప్రారంభమైందన్నారు. మరో వారంలో రెండో దశ కూడా ప్రారంభమవుతుందన్నారు. కరోనా నుంచి ప్రజల్ని రక్షిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. మ‌రియు ఇలాంటి పరిస్థితుల్లో ఐదు ‘ఐ’లపై దృష్టి సారించామని తెలిపారు.

ఇంటెంట్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్‌లపై దృష్టి పెట్టామని మోదీ తెలిపారు. ఇక ఇప్ప‌టికే ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చర్యలు ప్రారంభమయ్యాయని మోదీ వెల్ల‌డించారు. మ‌రియు భారత ఆవిష్కరణలపై ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం ఉందని తెలిపారు. విపత్కర సమయంలో తాము ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించామని చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నామని మెదీ వెల్ల‌డించారు.

ఆ ఐదు `ఐ`లపై దృష్టి పెట్టిన మోదీ.. ఎందుకంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts