`పుష్ప` షూటింగ్‌కు సుకుమార్ ప్లాన్ అదిరిపోయిందంతే..!!

June 1, 2020 at 11:00 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో `పుష్క` సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. . రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తుండ‌గా.. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సుకుమార్ ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు.

దీంతో బ‌న్నీకి ఇది తొలి పాన్ ఇండియా సినిమా. ఇక ఇప్ప‌టికే ఆయా భాషల్లో సంబంధించిన పోస్టర్స్‌‌కు సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా పుష్క‌ రెగ్యుల‌ర్ షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. త్వ‌ర‌లోనే సినిమాల చిత్రీక‌ర‌ణ ప్రారంభం కాబోతున్నాయి. ఈ త‌రుణంలో ఆగ‌స్ట్ నుండి పుష్ప‌ షూటింగ్ చేయాల‌నుకుంటున్నారు. అది కూడా ట్ర‌య‌ల్ అండ్ ఎర‌ర్ ప‌ద్ధ‌తిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించార‌ట సుకుమార్‌.

అంటే.. ముందుగా నెల రోజుల పాటు ప‌రిమిత సంఖ్య‌లోని స‌భ్యుల‌తో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తార‌ట‌. ఆ స‌మ‌యంలో స‌భ్యులంద‌రూ ఓ ప్రాంతంలోనే ఉంటార‌ట‌. వారు ఇత‌రుల‌ను క‌ల‌వ‌డం.. ఇత‌రులు వారున్న ప్ర‌దేశానికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చిత్తూరు యాసను ప్రత్యేకంగా నేర్చుకున్న విషయం తెలిసిందే. ఇక హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోని యాసలను నేర్చుకొని.. అన్ని భాషల్లోనూ తానే సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తున్నారట. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌కు మ‌రింత క్రేజ్ పెరిగింది.

`పుష్ప` షూటింగ్‌కు సుకుమార్ ప్లాన్ అదిరిపోయిందంతే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts