జుట్టుపీక్కుంటున్న జక్కన్న.. అంత హైరానా ఎందుకన్నా?

June 12, 2020 at 9:05 am

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో బాహుబలిని మించిన వండర్స్ ఈ సినిమా క్రియేట్ చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం పూర్తవ్వగా, లాక్‌డౌన్ కారణంగా ఈ షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఆర్ఆర్ఆర్‌కు పెద్ద అడ్డంకిగా మారిందని చిత్ర యూనిట్ అంటోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించడంతో, ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను వెంటనే ప్రారంభించాలని జక్కన్న అనుకున్నాడు. కానీ ఇతర దేశాల ఆర్టిస్టులు, ఇతర రాష్ట్రాల ఆర్టిస్టులు కూడా వేరే చోటికి వెళ్లి షూటింగ్ నిర్వహించలేని పరిస్థితులు ఉండటంతో రాజమౌళి జుట్టుపీక్కుంటున్నాడు. ఫారిన్ ఆర్టి్స్టులు సరే, కనీసం బాలీవుడ్ నటులు కూడా షూటింగ్‌ల కోసం ఇక్కడి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో జక్కన్న హైరానా అవుతున్నాడట.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లో ఎవరిని పెట్టుకుని షూటింగ్ చేయాలి, ఉన్నవారితో ఏ ఎపిసోడ్స్ తెరకెక్కించాలనే ఆలోచనలతో ఆయన టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా జక్కన్నకు అందుబాటులో ఇప్పుడు కేవలం ఎన్టీఆర్, చరణ్‌లు మాత్రమే ఉండటంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ మొదటికి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన ఆర్టిస్టులు ఆర్ఆర్ఆర్‌లో ఎప్పుడు జాయిన్ అవుతారో చూడాలి.

జుట్టుపీక్కుంటున్న జక్కన్న.. అంత హైరానా ఎందుకన్నా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts