
వివాదాలకు కేరాఫ్ అయిన వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అదేంటో ఈయన ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. కాదు.. కాదు.. సంచలనం అయ్యేలా ఈయన మాట్లాడతారు. వాస్తవానికి వర్మ ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేలా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఈయన ‘మర్డర్’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కుటుంబ కథా చిత్రమ్ అనేది ఉపశీర్షిక. ఫాదర్స్ డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ సంచటనం రేపాడు.
ఎందుకంటే.. ఈ చిత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత, మారుతీరావుల కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ సందర్భంలోనే ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఈ క్రమంలోనే చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఆయన రాజకీయంగా వేస్ట్ అని తేల్చేసాడు వర్మ. తాను సినిమాల పరంగా చిరంజీవిని ఇష్టపడతానని.. రాజకీయ నాయకుడిగా కాదని క్లారిటీ ఇచ్చాడు ఈ దర్శకుడు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వర్మ.. ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ అనే వాడు ఒక్కడే ఉంటాడు.. అది యూనిక్ అంటూ ప్రశంసలు కురిపించాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అయితే వాళ్ల తాత కంటే కూడా బెటర్ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ వివాస్నద దర్శకుడు. జూనియర్ ఎన్టీఆర్ బెటర్ ద్యాన్ సీనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పటిలాగానే ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.