రష్మికకు నిజంగానే ‘మైండ్ బ్లాక్’ చేసిన నెటిజన్లు

June 5, 2020 at 10:24 am

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఛలో సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోవడంతో, ఆమె వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ, ఆ సినిమా సూపర్ హిట్ కావడంలో తనవంతు పాత్రను పోషించింది.

కాగా ఈ సినిమాలో ఆమెకు మంచి పేరు రావడం దేవుడెరుగు కానీ, ఆమెను ట్రోల్ చేసిన వారి సంఖ్య చాలా ఎక్కువ. యాక్టింగ్ చేయవమ్మా అంటూ ఓవర్ యాక్టింగ్ చేసిందంటూ మహేష్ ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఇక అదంతా మర్చిపోయి తన నెక్ట్స్ మూవీని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప అనే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది.

ఈ బ్యూటీ పుష్ప సినిమాలో కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తే బన్నీ ఇమేజ్ కూడా తగ్గిపోతుందని వారు భయపడుతున్నారు. కాగా తాజాగా రష్మిక సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించగా, వారు ఆమె మైండ్ బ్లాక్ చేశారు. తల్లీ నువ్వు యాక్టింగ్ చేస్తే చాలు, ఓవర్ యాక్టింగ్ చేసి సినిమాను చెడగొట్టకు అంటూ కొందరు నేరుగా ఆమెను ఏసుకున్నారు. మరికొంత మంది సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఓవర్ యాక్టింగ్ రిపీట్ చేయకంటూ మరికొందరు ఆమెకు సూచించారు. మొత్తానికి మైండ్ బ్లాక్ పాటతో మహేష్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తించిన ఈ బ్యూటీకి నెటిజన్లు ఇప్పుడు నిజంగానే మైండ్ బ్లాక్ చేశారు.

రష్మికకు నిజంగానే ‘మైండ్ బ్లాక్’ చేసిన నెటిజన్లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts