మ‌హేష్ సినిమాలో రేణూ దేశాయ్.. క్లారిటీ ఇచ్చిన పవన్ మాజీ భార్య..!!

June 29, 2020 at 9:07 am

రేణు దేశాయ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు నటి, రచయిత, దర్శకురాలు రేణు దేశాయ్. మొద‌ట `బద్రీ` సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసిన నటించిన రేణూ పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడింది. అది పెళ్లిగా మారింది. అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె పుణెలో స్థిరపడ్డారు.

అయితే ఇప్పుడు మరోసారి తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రముఖ నటుడు మహేష్ బాబు తన జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం నుంచి ఓ ఆఫర్ పంపినట్లు వార్త‌లు వ‌చ్చాయి. అడివి శేష్ హీరోగా `మేజర్` సినిమా రూపొందుతోంది. శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో ఓ కీలక పాత్రకు గాను రేణు దేశాయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు గత వారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రేణూ క్లారిటీ ఇచ్చింది.

తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆమె.. ఇదే తాను విన్న అతి పెద్ద రూమర్ అని చెప్పుకొచ్చారు. గత రెండు మూడు రోజులుగా తానకు చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని, ఇలాంటి వార్తలను తెరపైకి తెచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు. ఇంత‌ పెద్ద చిత్రంలో తనకు నటించే అవకాశం వస్తే, తానే ప్రకటన చేసుండేదాన్నని, తనకు కూడా నటించాలని ఉందని, గతంలో ఎప్పుడు మదర్ రోల్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, హీరోల చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందుకు అంగీకారం తెలిపానని, దాని ఆధారంగానే ఈ తప్పుడు రూమర్ పుట్టుండవచ్చని అన్నారు. ఏదైనా గ‌త వారం రోజులుగా వ‌స్తున్న రూమ‌ర్స్‌కు రేణూ చెక్ పెట్టారు.

మ‌హేష్ సినిమాలో రేణూ దేశాయ్.. క్లారిటీ ఇచ్చిన పవన్ మాజీ భార్య..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts