తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి బిగ్ షాక్..!!

June 29, 2020 at 8:41 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబ‌రులో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాల ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతోంది. ఇక ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

అయితే ఇలాంటి స‌మ‌యంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి అలర్ట్. కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఏపీ ప్రయాణాలపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ మీదుగా ఏపీకి వెళ్లాలనుకునే వారు ఇకపై రాత్రి 7 గంటల లోపే తెలంగాణ రాష్ట్రం దాటిపోవాలని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే సరిహద్దుల్లో వాహనాలను అనుమతించడం జరుగుతుందని రంగనాధ్ స్పష్టం చేశారు.

కాబ‌ట్టి, 7 గంటల తర్వాత ఆంధ్రా సరిహద్దులకు వెళ్లి ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దని నల్గొండ ఎస్పీ సూచించారు. ఇక అటు సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారికి పాసులు ఉండాలని.. పాస్ లేకపోతే అనుమతించమన్నారు. అందువల్ల ఏపీకి వెళ్లాలనుకునేవారు సంబంధిత అధికారుల నుంచి పాసులు తీసుకోవాల‌ని సూచించారు.

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి బిగ్ షాక్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts