స‌మంత సేంద్రీయ వ్య‌వ‌సాయం.. ఎక్క‌డో తెలుసా..?

June 2, 2020 at 3:41 pm

అక్కినేని వారి కోడ‌లు స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2010లో ‘ఏ మాయ చేసావె’ అంటూ సినీ కెరీర్ ప్రారంభించిన సమంత పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక ఇటీవ‌ల నాగ‌చౌత‌న్య‌ను పెళ్లి చేసుకుని ఫుల్ సెటిల్ అయిన స‌మంత‌.. ఇప్పుడు కూడా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫ్యామిలీని, సినిమాల‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం క‌రోనా లాక్‌డౌన్‌లో కుటుంబంతో విలువైన స‌మాయాన్ని గడుపుతోంది.

దాంతో పాటు ఆన్‌లైన్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది. ఇప్పటికే భర్తతో షికారుకు వెళ్లిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న సమంత.. రీసెంట్‌గా తన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన మార్క్స్ షీట్‌ను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు, ఈ బ్యూటి సమంత వ్యవసాయం కూడా చేసే పనిలో పడింది. తన వెజిటబుల్‌ గార్డన్‌ను అభిమానులకు పరిచయం చేసింది.

Samantha shares a sneak-peek of her new terrace vegetable garden ...

తాజాగా సమంత తన వెజిటబుల్‌ గార్డన్‌ను ఫ్యాన్స్ కు కూడా పరిచయం చేసింది. అర్బన్‌ కిసాన్‌ వారితో కలిసి తన ఇంటి టెర్రస్‌ మీద వెజిటబుల్స్ పండిస్తోంది. కూరగాయలను మనమే ఎలాంటి కెమికల్స్ వాడ‌కుండా‌ ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేసుకుంటే ఎటువంటి వ్యాధులు రావు. అందుకని లాక్‌డౌన్‌లో సమంత ఆర్గానిక్‌ పద్ధతిలో కూర‌గాయ‌లు‌ పండించడం నేర్చుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది సమంత. సామ్ గార్డెన్ చూసిన ఆమె అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. సమంత సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Samantha Akkineni: ఇంటి దగ్గర కూరగాయలు ...

 

స‌మంత సేంద్రీయ వ్య‌వ‌సాయం.. ఎక్క‌డో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts