సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య.. షాక్‌లో టాలీవుడ్ స్టార్స్‌‌..!!

June 14, 2020 at 5:51 pm

టీవీ, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ చిత్రంలో హీరోగా నటించి దేశ‌వ్యాప్తంగా భారీ క్రేజ్‌ తెచ్చుకున్న‌ సుశాంత్.. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వయసు 34 సంవత్సరాలే కావ‌డం గ‌మ‌నార్హం. డిప్రెషన్‌తో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అటు బాలీవుడ్‌.. ఇటు టాలీవుడ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొంద‌రు టాలీవుడ్ స్టార్ హీరోలు సుశాంత్ బలవన్మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. `సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దిగ్భ్రాంతికరం. ఎంతో టాలెంట్ ఉన్న నటుడు చిన్నవయసులోనే మరణించడం బాధాకరం.` అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.

`సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇక లేడని తెలిసి షాక్ కు గురయ్యాను. అద్భుతమైన ప్రతిభ కలిగి, ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని భావించిన నటుడు ఎంతో త్వరగా వెళ్లిపోయాడు. ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.` అంటూ రామ్ చ‌ర‌ణ్ విచారం వ్య‌క్తం చేశారు.

`సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం గురించి తెలుసుకున్న తర్వాత మాటలకందని వేదన కలిగింద‌ని, షాక్ కు గురయ్యానని మ‌హేష్ బాబు వెల్లడించారు. పొంగిపొర్లే ప్రతిభకు నిదర్శనం లాంటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చాలా చిన్నవయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని` మ‌హేష్ ట్వీట్‌ చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య.. షాక్‌లో టాలీవుడ్ స్టార్స్‌‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts