నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ఏడో వసంతంలోకి అడుగు

June 2, 2020 at 8:59 am

నేడు తెలంగాణ ఏడో ఆవిర్భావ దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని అసెంబ్లీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఘ‌నంగా నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ వద్ద పోచారం, శాసనమండలి వద్ద గుత్తా జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను కేసీఆర్ నెరవేర్చారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ ఎప్ప‌టినుంచో కంటున్న క‌ల నెర‌వేరింది.

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలు మొదలయ్యాయి. అయితే, కరోనా వైరస్ కార‌ణంగా పెద్ద‌గా ఈ ఆవిర్భావ వేడుకలను సింపుల్‌గా చేసి ముగించేస్తున్నారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా కేవ‌లం నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ఏడో వసంతంలోకి అడుగు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts