షాకింగ్ న్యూస్‌.. హోం మంత్రికి కరోనా పాజిటివ్..!!

June 29, 2020 at 10:57 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య క‌రోనా వైర‌స్‌. కంటికి కనిపించని ఈ అతిసూక్ష్మజీవి.. మానవాళికి ఇప్పుడు పెద్ద గండంగా మారింది. ఇప్పటికే ల‌క్ష‌లాదిమందిని బలి తీసుకున్న ఈ క‌రోనా భూతం.. ప్ర‌పంచ‌దేశాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. యుద్ధాలు చేసినపుడు కూడా జరగని ప్రాణ నష్టం.. కరోనా వల్ల అమెరికాలో జరుగుతోంది. వైరస్‌ ధాటికి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఐదు ల‌క్ష‌లు దాటేసిందంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక మ‌రోవైపు కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి కాటుకు దేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు మరణించారు. మరికొంత మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీకి కరోనా సోకింది. గత కొద్ది రోజుల క్రితమే ఆయన గన్‌మెన్లకు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో మహమూద్‌ అలీకి కూడా కరోనా పరీక్షలు చేయగా.. రిపోర్ట్స్‌లో పాజిటివ్ తేలింది. ప్ర‌స్తుతం ఆయనను హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్తమా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ఇప్ప‌టికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్ లకు క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

షాకింగ్ న్యూస్‌.. హోం మంత్రికి కరోనా పాజిటివ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts