మిడతల దెబ్బకు గ్రామాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన తెలంగాణా…!

June 17, 2020 at 6:29 pm

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మిడతల దెబ్బకు భయపడుతుంది. మిడతల దండు ఎక్కడ వచ్చి దాడి చేస్తుందో అనే ఆందోళన ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని భయపెడుతుంది. తెలంగాణాలో ఇప్పుడు విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో రైతులు పెద్ద ఎత్తున పంటలు వేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వర్శాపాతం ఎక్కువగా ఉంటే ఖమ్మం జిల్లాతో పాటుగా మెదక్, అదిలాబాద్ జిల్లాల్లో ఇప్పుడు మిడతల భయం మొదలయింది.

అవి ఎటు నుంచి వచ్చి దాడి చేస్తాయో అని రైతులు భయపడుతున్నారు. లేత పంటను టార్గెట్ చేసి దాడి చేస్తే పంట మొత్తాన్ని నిమిషాల్లో పీల్చి వేస్తాయి. నాట్లు మీద పడ్డాయి అంటే మాత్రం ఏ మాత్రం కూడా మిగిలే అవకాశం అనేది ఉండదు. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. 9 జిల్లాల మీద మిడతల ప్రభావం ఉండే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక గ్రామాల్లో మిడతల కోసం ప్రత్యేక బృందాలను డ్రోన్ లను ఏర్పాటు చేస్తున్నారు. వేల లీటర్ల పురుగుల మందులను తరలిస్తున్నారు గ్రామాలకు. ఇక గ్రామాల్లో డప్పు కొట్టే కళాకారులను కూడా సిద్దం చేస్తున్నారు. మేళాలు వాయించే వారి సహకారం కూడా తీసుకుని పంట పొలాల మీద మిడతలు దాడి చేస్తే ఏం చెయ్యాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అవి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మిడతల దెబ్బకు గ్రామాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన తెలంగాణా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts