అచ్చెన్న మీద నమోదు చేసిన కేసులు ఇవే…!

June 13, 2020 at 5:49 pm

టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అచ్చెన్నాయుడు మీద ఇప్పుడు ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మీద ఇప్పటికే ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు అధికారులు.

క్రైమ్‌ నెంబర్‌ 04/ఆర్‌సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్‌ 13(1), (సీ), (డీ), ఆర్‌/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్‌ 408, సెక్షన్‌ 420, 120–బీ కింద అధికారులు ఆయన మీద కేసులు నమోదు చేసారు. ఇప్పుడు ఆయన వ్యవహారంలో ఏసీబీ మరింత దూకుడుగా వెళ్తూ టెక్కలికి చెందిన మరి కొందరిని కూడా టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక ఆయన దాదాపు ఈ వ్యవహారంలో వంద కోట్ల వరకు దారి మళ్ళించారు అని అధికారులు పక్కా ఆధారాలు సంపాదించారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరి కొంత మంది పేర్లు బయటకు వస్తున్నాయి. అప్పుడు సిఎం గా పని చేసిన చంద్రబాబు హస్తం కూడా దీనిలో ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇప్పుడు అచ్చెన్నను విచారిస్తే మరికొన్ని వ్యవహారాలూ బయటకు వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

అచ్చెన్న మీద నమోదు చేసిన కేసులు ఇవే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts