ఏపీలో అడుగు పెట్టాల్సిన వాళ్ళు తెలుసుకోవాల్సినవి ఇవే…!

June 1, 2020 at 11:21 am

ఇటీవల ప్రకటించిన లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఏపీ సర్కార్ అంతరాష్ట్ర రవాణా విషయంలో త్వరలో కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. అంతరాష్ట్ర రవాణా విషయంలో తెలంగాణా సహా ఏపీ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా జగన్ సర్కార్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడటం లేదు. తాజాగా వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఈ నెల 5 న జరిగే కేబినేట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో అడుగు పెట్టే వారి విషయంలో ఏపీ సర్కార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారంతా సూచనలు, నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. అదే విధంగా సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేసారు. పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇక కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తే 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌‌కు వెళ్ళాలి అని… పాజిటివ్ వస్తే ప్రభుత్వ క్వారంటైన్ వెళ్లాలన్నారు. అలాగే వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ నుంచి వచ్చే రైలు ప్రయాణికులందరికీ టెస్టులు చేయబడతాయని ఆయన స్పష్టం చేసారు. అవసరాన్ని బట్టి క్వారంటైన్‌కి పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. మెడికల్ టెస్ట్ రైల్వే స్టేషన్‌లో కానీ.. డిస్ట్రిక్ట్ రిసెప్షన్ సెంటర్‌లో కానీ నిర్వహిస్తామన్న ఆయన…. ఇక విదేశాల నుంచి వచ్చే వారంతా తప్పనిసరిగా ప్రభుత్వ లేదా పెయిడ్ క్వారంటైన్‌కి వెళ్లాలని పేర్కొన్నారు.

ఏపీలో అడుగు పెట్టాల్సిన వాళ్ళు తెలుసుకోవాల్సినవి ఇవే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts