ఆ నాలుగు కొన్ని చోట్ల లేవు… డబ్ల్యూహెచ్ఓ…!

June 30, 2020 at 12:09 pm

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఇంకా పూర్తిగా లేదా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా విషయంలో ఇప్పుడు ప్రపంచ దేశాలు తీసుకునే నిర్ణయాలు ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే విధంగా ఉన్నాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి.

 

అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది అంటే… లాక్ డౌన్ ని సడలించడం అనేది కరోనాను తక్కువ అంచనా వేయడమే అంటూ వ్యాఖ్యానించింది. కరోనా తీవ్రత ఇంకా ప్రపంచం చూడలేదు అంటూ పేర్కొంది. జులై చివరికి భారత్, పాకిస్తాన్, చైనా సహా ఆఫ్రికా దేశాల్లో కరోనా విశ్వరూపం చూస్తారు అంటూ హెచ్చరించింది. అసలు కొన్ని చోట్ల ట్రేస్, టెస్టింగ్, క్వారంటైన్, ఐసోలేట్ ఈ నాలుగు లేవని పేర్కొంది.

 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వ్యాప్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై దేశాధినేతలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి రావాలి అని సూచనలు చేసింది. కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వ్యాఖ్యలు చేసింది. మరి దీనిపై దేశాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి అనేది చూడాలి.

ఆ నాలుగు కొన్ని చోట్ల లేవు… డబ్ల్యూహెచ్ఓ…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts