ఇది విన్నారా.. రానా పెళ్లికి.. ప్లాన్ ఎ, ప్లాన్ బి, ప్లాన్ సి..!!

June 2, 2020 at 8:37 am

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రానా ద‌గ్గుబాటి.. ఇటీవ‌ల స‌డెన్‌గా త‌న ప్రేమ విష‌యాన్ని, ప్రియు‌రాలు మిహిక బజాజ్ ఫోటోను బ‌య‌ట‌పెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసిన సంగ‌తి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు అంగీకరించారు. దీంతో దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. ప్రేమలో ఉన్నానని అతడు ప్రకటించిన కొన్ని రోజులకు రామానాయుడు స్టూడియోలో రోకా వేడుక జరిగింది. కాబోయే వధూవరులు ఇద్దరూ నవ్వులు చిందిస్తూ నడిచారు. ఇక అతి త్వ‌ర‌లోనే త్వరలోనే ఏడడుగులు వేయనున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే రానా, మిహికాల వివాహం ఈ ఏడాది ఆగస్టు 8న జరగనుంది. పెళ్లి సంబరాలు మూడు రోజులు జరుగుతాయని తెలుస్తోంది. ఆగస్టు 6, 7 తేదీల్లో ప్రీ–వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ను ప్లాన్‌ చేస్తున్నారు వధూవరుల కుటుంబ సభ్యులు. పెళ్లిని తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. అతి కొద్దిమంది స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లోనే రానా మిహికాల పెళ్లి జరగబోతోంది. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే జరగనున్నాయ‌ని తెలుస్తోంది.

ఇక రానాకి కాబోయే భార్య మిహీకా వెడ్డింగ్‌ ప్లానర్‌. ఆమె ఆలోచనలకు అనుగుణంగా, ప్రత్యేకమైన థీమ్‌తో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయట. అలాగే అగస్టు నాటికి దేశంలో కరోనా వ్యాప్తి తగ్గితే… వివాహ వేడుకల్లో మార్పులు చేద్దామనే ఆలోచనలో ఉన్నార‌ట ఇరు కుటుంబాలు. అయితే మ‌రోవైపు కరోనా నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి ప్రభుత్వ నియమాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే మా ప్రయత్నంలో భాగంగా మేం ప్లాన్‌ ఎ, ప్లాన్‌ బి, ప్లాన్‌ సిలను సిద్ధం చేసుకున్నామని మిహికా బజాజ్‌ తల్లి బంటీ బజాజ్ తాజాగా‌ వెల్లడించారు. ఏదేమైనా దగ్గుబాటి వారబ్బాయి రానా, బజాజ్‌ వారమ్మాయి మిహీకా పెళ్లికి ముందు జాగ్ర‌త్త‌గానే మూడు ప్లాన్లు వేసుకున్నార‌న్న‌మాట‌.

ఇది విన్నారా.. రానా పెళ్లికి.. ప్లాన్ ఎ, ప్లాన్ బి, ప్లాన్ సి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts