మీ ఫోన్‌లో టిక్​టాక్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేశారా..? లేకుంటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే..!!

June 30, 2020 at 3:01 pm

టిక్‌టాక్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ యాప్‌కు ఇత‌ర దేశాల క‌న్నా.. భార‌త్‌లోనే ఎక్కువ క్రేజ్ ఉంది. కానీ, భారత్- చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా దేశానికి చెందిన 59 యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అందులో టిక్‌టాక్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ ఆదేశాలు జూన్ 30న అమలులోకి వచ్చాయి.

దీంతో పెద్ద‌ల నుంచి సామాన్యుల దాకా ల‌క్ష‌లాదిమంది భార‌తీయుల‌ను ఆక‌ట్టుకున్న టిక్‌టాక్ కూడా గూగుల్ ప్లేస్టోర్ నుంచి మాయ‌మైపోయింది. ఇక టిక్‌టాక్‌ నిషేధం అనంతరం టిక్‌టాక్ స్టార్లు ప్రస్టేషన్ లో మునిగిపోయారు. ఈ క్ర‌మంలోనే దీని ప్రత్యామ్నాయాలపై వైపు దృష్టిపెట్టారు. ముఖ్యంగా తమ అనుచరులను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఫాలో కావాలని కోరడం ప్రారంభించారు.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. దేశంలో లక్షలాది మంది ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఈ టిక్ టాక్ ను ఇప్పుడు అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలా? అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. అయితే అవి ఫోన్లలో ‌ఇన్‌స్టాల్ అయి ఉన్నప్పటికీ పని చేయవు. ఆ యాప్‌లో అప్‌డేట్లు ఇకపై కనపడవు. కానీ, ఆ యాప్‌ను స్మార్ట్‌ఫోన్లలో ఉంచుకోకపోతేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో భద్రత తగ్గిపోతుండడంతో వాటి ద్వారా స్మార్ట్‌ఫోన్లు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. సో.. వెంట‌నే టిక్‌టాక్‌కు అన్‌ఇన్‌స్టాల్ చేస్తే బెట‌ర‌న్న‌మాట‌.

మీ ఫోన్‌లో టిక్​టాక్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేశారా..? లేకుంటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts