రోజాకు అవకాశం ఉన్నట్టా లేనట్టా…?

June 30, 2020 at 6:07 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ విషయంలో అనేక చర్చలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. కేబినేట్ లోకి సిఎం జగన్ ఎవరిని తీసుకునే అవకాశం ఉంది అనే దాని మీద రోజుకో వార్త వస్తుంది. ఈ నేపధ్యంలోనే పార్టీలో కొందరి పేర్లను సిఎం జగన్ పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

 

అయితే ఆమెకు మంత్రి పెద్దిరెడ్డి నుంచి అలాగే మరో మంత్రి నారాయణ స్వామి నుంచి మద్దతు లేదు అని అంటున్నారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. భూమన ముందు నుంచి జగన్ కి అత్యంత సన్నిహితులు. ఇక రోజా జగన్ కోసం వచ్చారు పార్టీలోకి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే జై జగన్ అన్నారు అప్పట్లో. ఇక అక్కడి నుంచి జగన్ కోసమే ఆమె రాజకీయం చేస్తున్నారు.

 

గుంటూరు జిల్లా నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి రాకుండా విడదల రజనీ కి వస్తే… రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆర్కే రోజా భూమనలో ఒకరికి వస్తుంది. ఒకవేళ అక్కడ పిన్నెల్లి తీసుకుంటే జిల్లా నుంచి వీరికి అవకాశం ఉండకపోవచ్చు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. పిన్నెల్లి బలమైన నేత కావడం, భూమన, రోజా ఇద్దరో సన్నిహితులు కావడం, బీసీల్లో బలమైన నేత విడదల రజనీ కావడంతో ఎవరికి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

రోజాకు అవకాశం ఉన్నట్టా లేనట్టా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts