జ‌గ‌న్ అంటే.. జ‌గ‌నే.. అంతే…! ఏడాది పాల‌న‌పై ప్ర‌జానాడి ఇదే?

June 19, 2020 at 3:58 pm

“వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అనే నేను“-అంటూ ఆంధ్రప్ర‌దేశ్ రెండో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసి ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాది కాలం పాల‌న‌పై ఇప్ప‌టికే అనేక విశ్లేష‌ణ‌లు.. అనేక విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఎవ‌రి దారి వారిది! విమ‌ర్శించేవారు విమ‌ర్శించా.. కొనియాడేవారు కొనియాడారు. కానీ, వాస్త‌వం ఏంటం టే.. త‌న‌ను విమ‌ర్శించినా.. త‌న పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తినా.. త‌న పంథాలోనే సాగ‌డం జ‌గ‌న్ శైలి! ఒక‌రు పొగిడార‌ని పొంగిపోవ‌డం, మీడియా ముందుకు వ‌చ్చి.. వారిపై వ‌రాల జ‌ల్లు కురిపించేయ‌డం ఆయ‌న చేయ‌రు. ఎవ‌రో తిట్టార‌ని కూడా ఆయ‌న ప‌ట్టించుకోరు. అదో భిన్న‌మైన నాయ‌క‌త్వం.

నిజానికి ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో సీఎంను తిడుతున్నారంటూ.. కేసులు పెడుతున్నార‌ని విప‌క్షాల నేత‌లు హ‌డావుడి చేశారు. కానీ, వాస్త‌వం ఏంటంటే.. ఈ విష‌యంలో పార్టీలో చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు .. పోనీలే అన్నా.. అంటూ.. జ‌గ‌న్ లైట్ తీసుకున్నారట‌! కానీ, రోజులు మారేకొద్దీ.. విమ‌ర్శ‌లు బూతుల స్థాయికి చేరిపోయింది. దీంతో కీల‌క మంత్రులు, స‌ల‌హాదారుల సూచ‌న‌ల మేర‌కు కేసులు పెడ‌తామంటే.. ముభావంగానే స‌రే! అని చెప్పార‌ట‌! ఇలాంటిమ‌నిషి జ‌గ‌న్‌. తాను న‌మ్మిన దానికి పెద్ద‌పీట వేయ‌డం.. త‌న‌కు ఎవ‌రైనా ఏదైనా స‌మ‌స్య చెబితే.. మంచు ముద్ద‌లా క‌రిగిపోవ‌డం ఆయ‌న వీక్ నెస్‌!!

పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ తీసుకున్న ఏకైక‌, కీల‌క‌మైన నిర్ణ‌యం.. మేనిఫెస్టోలో చెప్పిన దానిని సంపూర్ణంగా అమ‌లు చేయ‌డం. అదే ఇప్పుడు కూడా ఆయ‌న అనుస‌రిస్తున్న మార్గం. మేనిఫెస్టో లో ఏం చెప్పారో.. ఆమేర‌కు జ‌గ‌న్ ముందుకు దూసుకుపోతున్నారు. సాధార‌ణంగా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తుంది. అదే ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్నారు. అయితే, దీనిని వ్య‌తిరేక మీడియా మాత్రం చిల‌వ‌లు ప‌ల‌వ‌లు చేసి చూపిస్తోంది. అమ‌రావ‌తిని ప్రాణంగాభావించాన‌ని చెప్పిన చంద్ర‌బాబు గ‌తంలో త‌న బ‌డ్జెట్‌లో ఎంత కేటాయింపులు చేశారో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌జాసంక్షేమానికి పెద్ద‌పీట వేశారు.. అంటే..మేనిఫెస్టోలో ఆయ‌న ఇదే చెప్పారు కాబ‌ట్టి.. దానికి త‌గిన విధంగానే ఆయ‌న అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో జ‌గ‌న్ పాల‌న సం క్షేమ రాజ్యం దిశ‌గానే దూసుకుపోయింది. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, పోల‌వ ‌రం, రాజ‌ధాని వంటి అంశాల్లో మ‌న‌కు పురోగ‌తి క‌నిపించ‌క‌పోవ‌చ్చు. అలా అనుకుంటే.. చంద్ర బాబు అధికా రంలోకి వ‌చ్చిన తొలి ఏడాదిలోనే ఆయ‌న ప్ర‌భుత్వం దూకుడు ప్ర‌ద‌ర్శించిందా? అప్ప‌ట్లో ఆయ‌న‌కు వంది మాగ‌ధులుగా నిలిచిన వారు.. ఇప్పుడే పుట్టిన రాష్ట్రంలో అప్పుడే అభివృద్ధి ఎలా సాధ్యంఅంటూ.. దీర్ఘాలు తీసిన‌విష‌యం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది.

ఇక‌, ఇప్పుడు మాత్రం జ‌గ‌న్ అభివృద్ధికి చాప‌చుట్టేశారంటూ.. ప్ర‌త్యేకంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కానీ, వాస్త‌వం ఏంట‌నేది ప్ర‌జ‌ల నాడిని చూస్తే తెలుస్తుంది. క‌రోనా క‌ట్ట‌డిలో ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రించిన వ్యూహాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కూడా కొనియాడ‌క‌పోయినా.. అనుస‌రిస్త‌న్న విష‌యం వాస్త‌వం. అదేస‌మ యంలో స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను అనేక రాష్ట్రాలు అమ‌లు చేస్తున్నాయి. అదేవిధంగా వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు మేలు క‌లిగిస్తున్నారు. అదేవిధంగా ఇత‌ర ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఆరోగ్య శ్రీని గ‌త ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టి దోబూచులాడితే.. జ‌గ‌న్ స‌ర్కారు ప‌ట్టాలెక్కించింది.

అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో రెండు కీల‌క సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఒక‌టి.. గోదావ‌రి న‌దిలో (తె లంగాణ‌-ఏపీ స‌రిహ‌ద్దులో) జ‌రిగిన లాంచీ ప్ర‌మాదం, రెండు విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ దుర్ఘ‌ట‌న ఈ రెండు మి న‌హా అంతా ప్ర‌శాంతంగానే సాగిపోయింది. రాజ‌కీయంగా చూసుకున్నా.. తాను గీసుకున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ను జ‌గ‌న్ ఎప్పుడూ దాటిపోలేదు. ప్ర‌జాప్ర‌తినిధిగా ఒక పార్టీలో గెలిచిన వారిని త‌న పార్టీలోకి తీసుకోలేదు. మ‌ద్ద‌తు చెబుతామంటే.. వ‌ద్ద‌న‌లేదు. ఈ విష‌యంలో ప‌క్కా క్లారిటీతోనే ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. మంత్రుల విష‌యంలోనూ దూకుడుకు ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకులు వేస్తూనే ఉన్నారు. పార్టీ నిర్ణ‌యాల్లోనూ ఆయ‌న ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ ఏడాది జ‌గ‌న్ పాల‌న‌కు సంబంధించి మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. ప్ర‌త్యేక హోదా! ఈ విష‌యం లోనూ జ‌గ‌న్ తాను ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పిందే అనుస‌రిస్తున్నారు. కేంద్రంలో బ‌లం లేక‌పోతే.. అప్పు డు మ‌నం కేంద్రాన్ని మేనేజ్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. కానీ, కేంద్రంలోబ‌ల‌మైన ప్ర‌భుత్వం ఉంది. అయినా .. కూడా కేంద్రంలో ప్ర‌త్యేక హోదా కోసం అడుగుతూనే ఉన్నారు. ఎంపీల‌ను ఎప్ప‌టి క‌ప్పుడు అలెర్ట్ చేస్తూనే ఉన్నారు. కాబ‌ట్టి ఇప్పుడు కాక‌పోతే.. ఎప్ప‌టికైనా సాధించి తీరుతామ‌నే న‌మ్మ‌కం ఉండ‌డం గొప్ప విష‌యం. సో.. ఇలా మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ అంటే.. జ‌గ‌నే.. ఆయ‌న మాట‌కు, ఆయ‌న‌కు తేడా లేదు!! అంతే!! అంటోంది ప్ర‌జానాడి!

జ‌గ‌న్ అంటే.. జ‌గ‌నే.. అంతే…! ఏడాది పాల‌న‌పై ప్ర‌జానాడి ఇదే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts