అక్కినేని కోడ‌లా మ‌జాకా…జీవితాన్ని త‌ల‌కింద‌లు చేసేసింది

July 5, 2020 at 9:20 am

అక్కినేని కోడ‌లు స‌మంత ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం జిమ్ యోగా ధ్యానం త‌ప్ప‌నిస‌రి రొటీన్ వ్యాప‌కాలు. ఇటీవ‌ల క్వారంటైన్ స‌మ‌యంలో రూల్ బ్రేక్ చేయ‌కుండా నిరంత‌రం యోగ సాధ‌న చేసారు సామ్. ఇక‌పోతే ఇటీవ‌ల త‌మ ఫ్యామిలీ ఫ్రెండ్ శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ రావ‌డంతో అక్కినేని ఫ్యామిలీ అంతా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ఆ క్ర‌మంలోనే స‌మంత ఎంతో జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో ఈ క్వారంటైన్ టైమ్ ని గ‌డిపేందుకు ఆస్కారం ల‌భించింది. అలాగే త‌మ పెంపుడు పెట్ డాగ్ తోనూ సామ్ బోలెడంత టైమ్ పాస్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోల్ని ఇటీవ‌ల రివీల్ చేసింది. ఇక ఈ స్వీయ‌నిర్భంధ స‌మ‌యంలో స‌మంత‌- చైత‌న్య జంట సోష‌ల్ మీడియా ప్ర‌క‌ట‌న‌ల‌తోనూ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే.

స‌మంత ఇటు తెలుగు అటు త‌మిళంలో న‌టిస్తోంది. అలాగే డిజిట‌ల్లోనూ అడుగులు వేస్తోంది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య న‌టించిన ల‌వ్ స్టోరి రిలీజ్ కావాల్సి ఉండ‌గా.. త‌దుప‌రి శివ నిర్వాణ స‌హా ప‌లువురు ద‌ర్శ‌కులు వినిపించిన స్క్రిప్టుల్ని ఫైనల్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని తెలిసింది.

అక్కినేని కోడ‌లా మ‌జాకా…జీవితాన్ని త‌ల‌కింద‌లు చేసేసింది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts