ఆచార్య సెట్ కి చరణ్

July 2, 2020 at 9:15 pm

జక్కన్నతో సినిమా చేయడమంటే మాములు మాటలు కాదండోయ్.. జక్కన్నా.. మజాకా అన్నట్లు ఉంటుంది. ఆయనతో సినిమా చేయడమంటే ఆయన చెప్పినట్లు వినాలి. ప్రస్తుతం చరణ్ ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం పూర్తి కాక‌ముందే వేరొక షూటింగ్ కి జాయిన్ కాకూడ‌ద‌న్నది ఓ డీల్. అది జ‌క్కన్న రూల్. కానీ ఇప్పుడు ఆ రూల్ కి బ్రేక్ వేసి చ‌ర‌ణ్ నేరుగా ఆచార్య సెట్స్ లో జాయిన్ అవుతాడ‌ట‌. ఇక ఇన్నాళ్లు ఉపేక్షించినా మ‌హ‌మ్మారి త‌గ్గేట్టు లేద‌ని అర్ధమయ్యాక చిరంజీవి-చ‌ర‌ణ్ బృందం ఆచార్య‌ సెట్స్ కెళ్లేందుకే నిర్ణయించుకున్నార‌ట.
పరిమిత సిబ్బందితో స‌మ‌యానుకూలంగా.. కొత్త ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేస్తూ షూటింగ్ కొనసాగించడం తనకు సాధ్యం కాదని రాజమౌళి గ్రహించిన తరువాత ఆర్ఆర్ఆర్ చిత్రీక‌ర‌ణ‌ నిరవధికంగా వాయిదా వేశారు. ఏదేమైనా, షూటింగ్ పునః ప్రారంభాన్ని వాయిదా వేసి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదలను 2021 సెకండాఫ్ కి వాయిదా వేశాడు.
దీంతో రామ్ చరణ్ ముందు కొరటాల `ఆచార్య` సెట్స్ కి జాయిన్ అయ్యి తన భాగాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట. అలా చేస్తే ఆచార్య‌ విడుదల తేదీని త్వరలోనే ప్లాన్ చేస్తారేమో.
ముందుగా మహేష్ బాబు ఆ పాత్రను చేయాలని కొర‌టాల భావించినా.. చివ‌రికి రామ్ చరణ్ చేయాల‌ని చిరు అన్నారు. దీంతో కొర‌టాల ప్లాన్ మార్చారు. ఇక షూటింగ్ ప్రారంభించాలి అనుకునేసరికి మ‌హ‌మ్మారీ సమస్య వచ్చి పడింది. వాయిదాల పర్వంతో చికాకు పుట్టుకొస్తోంది. ఇప్పటికే కొరటాల ఈ చిత్రం కోసం రెండేళ్లుగా వేచి చూస్తున్నారు నిరంతరం ఆలస్యం అవుతున్నందుకు కొరటాల ధ అంతా ఇంతా కాదు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను రెండేళ్ళకు పైగా వృధా చేశానని తన స్నేహితులకు చెప్పుకుని వాపోతున్నార‌ట‌. మొత్తానికి ఈ ప‌రిస్థితిని స‌మీక్షించి చిరు, చ‌ర‌ణ్ అందుబాటులోకి రావాల‌న్న డిమాండ్ ఊపందుకుంది. మరి చివరికి ఏమిచేస్తారో.

ఆచార్య సెట్ కి చరణ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts