ఆర్టీసి ఉద్యోగులను భయపెడుతున్న కరోనా… విధులకు దూరం…!

July 11, 2020 at 6:56 pm

ఆర్టీసీ ఉద్యోగుల్లో ఇప్పుడు కరోనా కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. ప్రతీ రోజు కూడా ఎక్కడో ఒక చోట ఆర్టీసి ఉద్యోగికి కరోనా బయటపడుతూనే ఉంది. నెల్లూరు లో ఒక ఆర్టీసి డ్రైవర్ కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. అతనితో పాటుగా అతని ముగ్గురు కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చింది. మరి కొంత ప్రయాణికులు కూడా కరోనా పరిక్షలు చేయించుకున్నారు అని తెలిసింది.

ఇక తెలంగాణా ఆర్టీసి ఉద్యోగుల్లో కూడా కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణా ఆర్టీసి లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆర్టీసీలో 30 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవ్వగా, కరోనాతో పోరాడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు అని అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీలో కరోనా వెంటాడుతుంటే యాజమాన్యం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

సింగరేణి-రైల్వే తరహాలో తార్నాక హాస్పిటల్‌లో ప్రత్యేకంగా 100 పడకలను కరోనాకు కేటాయించాలి అని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికే నాలుగు నెలలుగా ఉద్యోగులు విధులకు దూరంగా ఉండి ఒక నెల రోజుల నుంచి విధులకు వస్తున్నారు. ఈ క్రమంలో వారికి పూర్తి స్థాయిలో జీతం కూడా అందలేదు. ఇక ఇప్పుడు కరోనా కేసులు వారిలో ఎక్కువగా రావడంతో కొంత మంది లాంగ్ లీవ్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారు.

ఆర్టీసి ఉద్యోగులను భయపెడుతున్న కరోనా… విధులకు దూరం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts