ఆలియాకి అత‌నంటే అంత ఇష్ట‌మా?

July 5, 2020 at 7:58 pm

దక్షిణాది హీరోల్లో ప్రభాస్ అంటే అలియాభట్ కు చాలా ఇష్టమట!. `బాహుబలి`లో అతడి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఆ సినిమా చూసి ప్రభాస్‌కు అభిమానిగా మారిపోయా. అవకాశం వస్తే ప్రభాస్‌తో నటించాలని ఉందని చెప్పింది అలియా. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది అలియా. ఎంతో మంది అభిమానించే ఆలియాకు ఇష్టమైన దక్షిణాది హీరో ఎవరు..? అని అడిగితే ఓఇంటర్వ్యూ లో అలియా తనకిష్టమైన హీరో గురించి చెప్పింది రణ్‌బీర్‌ కపూర్‌ ,అలియా భట్‌ వివాహం గురించిన వార్తలు తరచూ తెరపైకి వస్తూనే ఉన్నాయి.

తాజాగా వీరి వివాహం గురించిన ఓ కొత్త వార్త బాలీవుడ్‌ లో వినిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో రణ్‌బీర్‌ – ఆలియా ప్రేమికుల నుంచి భార్యాభర్తలు అవుతారని టాక్‌. వీరి పెళ్లిని డిసెంబరు 7న లేదా 21న జరిపేలా రెండు కుటుంబాలు ఆలోచనలు చేస్తున్నారని సమాచారం. పెళ్లి వేడుకలను నాలుగు రోజులు జరపాలనుకుంటున్నారని తెలుస్తోంది . అలియాభట్‌ తెలుగులో ఎంట్రీ ఇస్తూ ‘ఆర్‌ ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌కు జోడీగా నటిస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్) ఇప్పటికే 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. పూణేలో జ‌ర‌గాల్సిన షెడ్యూల్ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో వాయిదా ప‌డింది. వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత షెడ్యూల్ జ‌రుగుతుంద‌ని టాక్‌. రామ్‌చ‌ర‌ణ్‌, అలియా సాంగ్‌తో షెడ్యూల్‌ను ప్రారంభిస్తార‌ట‌. సాంగ్ త‌ర్వాత కీల‌క స‌న్నివేశాల‌ను కూడా చిత్రీక‌రిస్తార‌ట‌. అలియాభట్‌ దీంతోపాటు సూపర్‌హీరో ప్రధానంగా తెరకెక్కే ‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి నటి స్తోంది. ఇది మూడు భాగాలుగా విడుదల కానుంది. ఇక మొదటిసారి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయి’లో నటిస్తోంది. ముంబయి మాఫియా డాన్‌ ‘గంగూబాయి కథియవాడి’ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. అలాగే తండ్రి మహేష్‌భట్‌ రూపొందిస్తున్న ‘సడక్‌2’లోనూ కథానాయికగా నటిస్తుంది.

ఆలియాకి అత‌నంటే అంత ఇష్ట‌మా?
0 votes, 0.00 avg. rating (0% score)