ఆ న‌టి పై అంత ఘోరం జ‌రిగిందా?

July 5, 2020 at 8:25 pm

ఆమె ఓ న‌టి. క‌న్న‌డ‌లో చాలా సినిమాల్లో నటించింది. ఆ క్రేజ్ తో కోలీవుడ్ లోనూ బాగానే అవ‌కాశం అందుకుంది. అక్క‌డా బిజీ స్టార్ గా మారుతోంది. ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు పెరుగుతున్నాయి. అయితే ఆ అంద‌మైన న‌టిపై ఓ కంపెనీ సీఈవో క‌న్ను ప‌డింది. అవ‌కాశం పేరుతో వంచించే ప్ర‌య‌త్నం చేసాడు. లొంగ‌క‌పోవ‌డంతో ఏకంగా అత్యాచారానికే పాల్ప‌డ్డాడు. ఆ దృశ్యాల్ని కెమెరాలో చిత్రీక‌రించి బెదిరింపుల‌కు పాల్ప‌డి ఇంకా కృర మృగంలా మారిపోయాడు! అన్న ఘ‌ట‌న ఆ న‌టి బెంగుళూరు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే ..

2018లో గాంధీబ‌జార్ కాఫీడేకు వెళ్లిన స‌మ‌యంలో నాయంహ‌ళ్లికి చెందిన మోహిత్ అనే వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. ఓ ప్ర‌యివేట్ కంపెనీ సీఈవో అని ప‌రిచయం చేసుకున్నాడు. త‌న కంపెనీకి ప్ర‌చార‌క‌ర్త‌గా నియ‌మించుకుంటునాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. గ‌తేడాది గోవా తీసుకెళ్లి ఫోటోషూట్ చేసాడు. అలాగే కంపెనీ న‌ష్టాల్లో ఉంద‌ని 1.50 ల‌క్ష‌లు తీసుకున్నాడు. జూన్ 22 ఆ న‌టి ఇంట్లోనే గ్రాండ్ గా ఆమె పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించాడు. ఆ స‌మ‌యంలో కూల్ డ్రింక్ లో మ‌త్తు మందు క‌లిపి అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు న‌టి ఆరోపించింది. ఆ దృశ్యాల్ని చూపించి బెదిరించి కోరిక తీర్చుకునే వాడ‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

అలాగే గ‌త నెల జూన్ 24 డ‌బ్బులు కావాల‌ని..ఇవ్వ‌క‌పోతే ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తాన‌ని మ‌రోసారి డ‌బ్బు కోసం బెదిరించిన‌ట్లు తెలిపింది. దీంతో అప్ప‌టిక‌ప్పుడు 11 ల‌క్ష‌లు ఏర్పాటు చేసి ఇచ్చిందిట‌. మరోసారి అత్యాచార య‌త్నానికి, బ్లాక్ మెయిల్ కి పాల్ప‌డ‌టంతో మ‌ళ్లీ 9 ల‌క్ష‌లు ఇచ్చిందిట‌. ఈ ఘోరాలు భ‌రించ‌లేని న‌టి చివ‌రికి కుటుంబ స‌భ్యుల‌కు విషయం చెప్పి పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మోహిత్ తో పాటు రాహుల్ అనే మ‌రో వ్య‌క్తిపై కూడా పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఆ న‌టి పై అంత ఘోరం జ‌రిగిందా?
0 votes, 0.00 avg. rating (0% score)