ఆ సీన్ అంటే బాల‌య్య‌కి ఇష్ట‌మ‌ట… ఇప్పుడు బోయ‌పాటి ప‌రిస్థితి ఏంటి ఉంచ‌లేడు తియ్య‌లేడు

July 23, 2020 at 10:43 am

కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం స్తంభించిపోయి.. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టడానికి నానాకష్టాలు పడాల్సి వస్తోంది. ఇప్పటికే చాలా మంది చిత్రనిర్మాతలు ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌ లను పూర్తిగా రద్దు చేసుకున్నారు. కాగా బాలయ్య – బోయపాటి సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను వారణాసి మరియు హిమాలయాలలో షూట్ చేయాల‌ట‌. ఆ సీక్వెన్స్ లు కథకు చాలా కీలకమైనవి అట.

అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్కడే షూట్ చేయాలి తప్ప, స్టూడియోల్లో సెట్ వేయడం సాధ్యం అయ్యే పని కాదని.. స్క్రిప్ట్ లో మార్పులు చేద్దామని అనుకున్నా.. బాలయ్యకి ఆ సీక్వెన్స్ బాగా నచ్చిందట, కానీ అక్కడేమో షూటింగ్ చేయడం అసాధ్యం అయిపొయింది. సీక్వెన్స్ తీసేస్తే బాలయ్యకు కోపం, ఉంచితే కరోనాతో పని అయ్యేలా లేదు. మొత్తానికే కష్టం అవుతుంది. మరి ఇప్పుడు బాలయ్య బృందం ఏమి చేస్తోందో.. ఏది ఏమైనా మొత్తానికి కరోనా ఎఫెక్ట్ బాలయ్య సినిమా పై గట్టిగానే పడింది. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు, బడ్జెట్ సమస్య కావడంతో స్టార్ హీరోయిన్ని పెట్టుకున్నే స్తొమత లేకుండా పోయింది. ఇంతకీ బాలయ్య పక్కన చేయబోతున్న ఆ కొత్త హీరోయిన్ ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్, మొదటిసారి బాలయ్య సినిమాకి మ్యూజిక్ ఇస్తుండటంతో మ్యూజిక్ పై బాగానే అంచనాలు ఉన్నాయి. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించాడు, కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ బోయపాటిని తెగ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినా అంతా బోయపాటి చేతిలో ఉంటే వినయ విధేయ రామ అంటూ భారీ డిజాస్టర్ ఎందుకు తీస్తాడు. మరి బాలయ్యకు బోయపాటి హిట్ ఇస్తాడో.. చేతులు ఏతేస్తాడో చూడాలి.

ఆ సీన్ అంటే బాల‌య్య‌కి ఇష్ట‌మ‌ట… ఇప్పుడు బోయ‌పాటి ప‌రిస్థితి ఏంటి ఉంచ‌లేడు తియ్య‌లేడు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts