ఈ హీరోల వెనుక అస‌లేం జ‌రుగుతోంది?

July 5, 2020 at 8:15 pm

కోలీవుడ్ స్టార్ హీరోల వెనుక అస‌లేం జ‌రుగుతోంది? మొన్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్…నేడు త‌మిళ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్! రేపు మ‌రొక స్టార్ హీరో? ఇలా ఎంత మంది హీరోలు ఈ టెన్ష‌న్ తో స‌త‌మ‌త‌మ‌వ్వాలి? ఇప్పుడివే ప్ర‌శ్న‌లు కోలీవుడ్ స్టార్ హీరోలంద‌ర్నీ వేధిస్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో స్టార్ హీరోలంద‌రికి బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ ప‌ది రోజుల క్రితం సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ఇంటికి ఓ ఫోన్ కాల్ వెళ్లింది. ఇంట్లో బాంబులు పెట్టాం. మరికాసేప‌ట్లో బ్లాస్ట్ అవ్వ‌బోతుంద‌ని నేరుగా ర‌జ‌నీకాంత్ కే ఫోన్ చేసి బెదిరించాడు ఓ అగంత‌కుడు. దీంతో ర‌జనీ హుటాహుటిన పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆ ఇల్లు పోలీసుల వ‌ల‌యంలోకి వెళ్లిపోయింది.

ఆ ఏరియాలో క‌ర్ఫ్‌యూ విధించి ఇల్లంతా సోదా చేసారు. బాంబ్ స్వ్కేడ్ స‌హా ఇత‌ర పోలీస్ సిబ్బంది అంతా రంగంలోకి దిగా ఆ ప్రాంగ‌ణం మొత్తం గాలించారు. అయినా చిన్న ట‌పాకాయ కూడా దొర‌క‌లేదు. దీంతో అది బెదిరింపు కాల్ అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌రుక‌వ‌మే ముందే నేడు మ‌రో స్టార్ హీరో విజ‌య్ కు ఇలాంటి బెదిరింపు కాల్ ఒక‌టి వ‌చ్చింది. బాంబుల‌తో త‌న ఇంటిని పేల్చేస్తామ‌ని ఫోన్ కాల్స్ వెళ్లాయి. అదీ నేరుగా విజ‌య్ పోన్ కే కాల్ వెళ్లింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై పోలీసులు ఇంటికీ భారీ భ‌ద్ర‌త క‌ల్పించారు. అవ‌స‌ర‌న‌మైన చోట పోలీస్ పీకేట్ ఏర్పాటు చేసారు.

ఓ టీమ్ ఇల్లాంతా బాంబు కోసం తనిఖీలు చేస్తోంది. ఆ ఇంట్లో బాంబ్ ఉందో? పెట్ట‌బోతున్నారో? తెలియ‌దుగానీ పోలీస్ ఎన‌ర్జీ అంతా వృద్ధా మాత్రం అవుతోంది. అదీ వ‌రుస‌గా ఇద్ద‌రు అగ్ర హీరోల‌కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావ‌డంతో మిగ‌తా హీరోలు బెంబేలెత్తిపోతున్నారు. అదీ క‌రోనా కాలంలో హీరోలంతా ఇళ్ల‌లో ఉన్న స‌మ‌యంలో ఇలాంటి కాల్స్ మ‌రింత ఆందోళ‌న‌కు దారి తీస్తున్నాయి. అస‌లు కోలీవుడ్ లో ఏం జ‌రుగుతుందో అర్ధం కాని స‌న్నివేశం ఎదుర‌వుతోంది. మ‌రో వైపు దేశంలో ఉగ్ర‌మూక‌లు విరుచుకుప‌డుతున్నారు. భార‌త జ‌వాన్ల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డుతోన్న వెళ‌…ఇలాంటి ఫోన్ కాల్స్ ని లైట్ తీసుకోవ‌డానికి లేదు.

ఈ హీరోల వెనుక అస‌లేం జ‌రుగుతోంది?
0 votes, 0.00 avg. rating (0% score)