ఎవ‌రి కోసం చిరు ఈ స్లిమ్ లుక్‌?

July 19, 2020 at 6:51 pm

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 152వ సినిమా `ఆచార్య‌` కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో చిరంజీవి లాక్ డౌన్ ఇబ్బందుల‌ను గుర్తించి సీసీసీ పేరిటి సినీ కార్మికుల‌కు నిత్యావ‌సర‌ స‌రుకులు అందించారు. సెల‌బ్రిటీలు ఇచ్చిన విరాళ‌ల‌తో వీటిని అందించ‌డం జ‌రిగింది. అయితే ఇదే స‌మ‌యంలో చిరంజీవి జిమ్ములో వ‌ర్కౌట్లు కూడా బాగానే చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న న్యూలుక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. బాగా స‌న్న‌బ‌డి స్లిమ్ లుక్ లో క‌నిపిస్తున్నారు.

బాడీ పెంచి..మీసాలు తీసేసి..టీష‌ర్ట్ తో ఉన్న ఫోటో మెగా అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. మెగాస్టార్ ఆచార్య‌లో ఇలాంటి లుక్ లోనే క‌నిపిస్తారంటూ అభిమానులు ఆ ఫోటో‌ని ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఈ ఫోటో ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందంటే? దాని వెనుక మ‌రో క‌థ ఉంది. యువ నటుడు సత్యదేవ్ హీరోగా గోపీ గ‌ణేష్ ద‌ర్శ‌క‌త్వంలో బ్లఫ్ మాస్టర్ అనే ఓ చిత్రం తెర‌కెక్కి ఆ మ‌ధ్య‌ విడుదలై స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ కార‌ణంగా చిరంజీవి టైమ్ దొర‌క‌డంతో ఇంట్లో టీవీలో ఈ చిత్రాన్ని అనుకోకుండా చూసారు. దీంతో సినిమా బాగా న‌చ్చ‌డంతో చిరంజీవి వెంట‌నే ఆ చిత్ర ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్ ని ఇంటికి పిలిపించి ప్ర‌శంసించారు.

గ‌ణేష్ ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు మెగాస్టార్ తో ముచ్చ‌ట‌ప‌డి ఫోటో దిగాడు. ఆ ఫోటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. అలా చిరంజీవి కొత్త లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సైరా న‌ర‌సింహారెడ్డి కోసం చిరంజీవి భారీగా బ‌రువు పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆచార్య కోసం మ‌ళ్లీ వ‌ర్కౌట్లు చేసి బ‌రువు తగ్గించారు. ఇప్ప‌టికీ చిరంజీవి ఆ వ‌ర్కౌట్ల‌ని కంటున్యూ చేస్తున్నారు. ఆచార్య త‌ర్వాత చిరంజీవి మ‌ల‌యాళ సినిమా లూసీఫ‌ర్ రీమేక్ లో న‌టించ‌నున్నారు. ఈ సినిమాని సాహో ద‌ర్శ‌కుడు సుజిత్ తెర‌కెక్కించ‌నున్నాడు.

ఎవ‌రి కోసం చిరు ఈ స్లిమ్ లుక్‌?
0 votes, 0.00 avg. rating (0% score)