క‌రోనా వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి…దేవుడే దిక్కంటున్నారు?

July 12, 2020 at 8:06 pm

భారత్ లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అదుపు త‌ప్పుతోందా? దానికి సంకేత‌మే దేశ వ్యాప్తంగా కేసులు పెర‌గ‌డ‌మా? స‌మూహ వ్యాప్తి భార‌త్ లో మొద‌ల‌వుతుందా? ఇప్పుడు వీట‌న్నింటికి మించి వ‌ర్షాకాలంలో అంత‌క‌న్నా ప్ర‌మాద‌క‌రంగా మార‌బోతుందా? అంటే అవున‌నే అంటున్నారు తెలుగు రాష్ట్రాల డాక్ట‌ర్లు. లాక్ డౌన్ ఎత్తివేత త‌ర్వాత దేశంలో కరోనా ఉగ్ర రూపం దాల్చుతోన్న సంగ‌తి తెలిసిందే. కేసుల సంఖ్య ఒక్క‌సారిగా పెరిగిపోయింది. మ‌ర‌ణాలు అదే స్థాయిలో ఉన్నాయి. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఊహించ‌ని విధంగా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ ఉన్నంత కాలం పదుల సంఖ్య‌లో న‌మోద‌య్యే కేసులు ఒక్క‌సారిగా వంద‌ల‌కు చేరుకున్నాయి.

ఇప్ప‌టికే హైద‌రాబాద్ జీహెచ్ ఎంసీ ఫ‌రిదిలో క‌రోనా కి వైద్యం అందించే ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు చెతులెత్తేసారు. వ్యాప్తిని అడ్డుకోలేక ప్ర‌భుత్వం సైతం ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటుంది. ఇక ముందే ఊహించిన‌ట్లుగా వ‌ర్షా కాలంలో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోందిప్పుడు. దీంతో తెలుగు రాష్ట్రాల డాక్ట‌ర్లు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇవి మామూలు వ‌ర్షాలుకాదు…క‌రోనా వ‌ర్షాలంటూ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స‌హ‌జంగా వ‌ర్షాకాలం అంటే వైర‌ల్, ప్లూ జ్వ‌రాల‌కు అనుకూల‌మైన సీజ‌న్. ఎక్కువ మంది జ్వరాల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో కొవిడ్ కి-సాధార‌ణ జ్వ‌రానికి తేడా తెలియ‌డం క‌ష్ట‌మంటున్నారు.

సాధార‌ణ జ్వ‌రం వ‌చ్చి దానిమీద .కొవిడ్ కూడా సోకిందంటే పరిస్థితి అందోళ‌న క‌రంగా ఉంటుందంటున్నారు. గ‌త నెల రోజులుగా న‌మోద‌వుతోన్న డెత్ కేసుల ఆధారంగా డాక్ట‌ర్లు ఈ భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ క‌రోనా బారిన ప‌డితే చిన్న పిల్లలు, వ‌య‌సులో పెద్ద వారు మాత్ర‌మే చ‌నిపోయేవారు. కానీ నెల‌న్న‌ర రోజులుగా 16 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు కూడా ఎక్కువ‌గా చ‌నిపోతున్నార‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఇది అంటు వ్యాధి కాబ‌ట్టి వ‌ర్షాకాలంలో ఇంకా వేగంగా వైర‌స్ వృద్ధి చెంద‌డంతో పాటు వేగంగా సోకుతుంద‌ని హెచ్చ‌రించారు. క‌రోనాకి మందు కూడా లేదు కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కూ ఇంట్లోనే ఉండాల‌ని సూచిస్తున్నారు. వైర‌స్ ఉదృతి ఎన్నాళ్లు ఉంటుందో తెలియ‌దు…కానీ ఆరు నెల‌లు మాత్రం అంతా జాగ్ర‌త్త‌గా ఉండ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. వైర‌స్ అదుపులోకి వ‌చ్చిన చైనాలోనే ఇప్ప‌టికీ అక్క‌డ‌క్క డ కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని తెలిపారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో భార‌త్ మిగ‌తా దేశాల‌న్నింటికంటే జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. అలా కాకుండా ఇష్టానుసారం బ‌య‌ట తిరిగితే వార్షాలు కార‌ణంగా క‌రోనా తొంద‌ర‌గా సోకే అవ‌కాశం ఉంద‌ని..వాళ్ల ద్వారా ఇతరుల‌కు సోకుతుంద‌ని..త‌ద్వారా స‌మూహ వ్యాప్తికి ఎక్కువ అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇలా కేసులు పెరిగి ఆసుప‌త్రుల మీద ప‌డితే డాక్ట‌ర్లు కూడా చికిత్స చేయ‌ర‌ని..ఎవ‌రికి వారు చేతులు దులుపునే ప‌రిస్థితే ఎదుర‌వుతుంద‌ని హెచ్చరిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ ర‌క‌మైన ప‌రిస్థితి హైద‌రాబాద్ లో ఎదుర‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

క‌రోనా వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి…దేవుడే దిక్కంటున్నారు?
0 votes, 0.00 avg. rating (0% score)