తెలంగాణ జాన‌ప‌ద గాయ‌కులు నిస్సార్ మృతి

July 10, 2020 at 10:58 pm

తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ జానపద గాయకులు నిస్సార్ కన్ను మూశారు. క రోన మహమ్మారి మొదలైనప్పటి నుండి ఆయన చని పోయే వరకు కరోన పై ఆయన స్వంతంగా రచించి అనేక పాటలను పాడి ప్రజలను జాగృతం చేసాడు .అలాంటి ప్రజాకవి అదే కరోన కాటుకు బలయ్యాడు మలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో పాటలు పాడారు అలాంటి మహా కవి కరోన తో , చివరి నిమిషంలో.దాదాపు ఆరు ఆసుపత్రులు తిరిగినా ఆయనకు బెడ్ దొరకలేదని చెబుతున్నారు.

యాభై ఆరేళ్ల మహమ్మద్ నిస్సార్ ఆర్టీసీలో ఏడీసీగా ఉన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ ఈయూ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, తెలంగాణ ప్రజా నాట్య మండలిలో కార్యదర్శిగా ఉన్నారు. ఆయన సొంతూరు యాదాద్రి జిల్లా గుండాల దగ్గర సుద్దాల.”పండూ వెన్నెల్లలోన.. పాడేటి ఆటలేమాయె.. మన పల్లెటూరిలోనా ఆడేటి ఆటలేమాయె” వంటి పాటలు ఆయనకు పేరు తెచ్చాయి. ”సుట్టూ పక్కల ఎక్కడ సూశిన పొట్టాలల్లో ఆకలి మంటలు.. సుట్టుకపోయిన పేగులన్నీ తట్టీలేపుతున్నయి.. బుసగొట్టలేవమన్నయ్‌” అనే పాట కరవుపై రాశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాటలతో చురుగ్గా పాల్గొన్నారు.

నిస్సార్ కరోనాపై అవగాహన పెంచేలా ఒక పాట, లాక్ డౌన్ కష్టాలపై పాట రాశారు. లాక్ డౌన్ పై రాసిన పాట వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. కరోనాపై ఆయన రాసిన పాటను వందేమాతరం శ్రీనివాస్ పాడారు. మార్చి చివర్లో దీన్ని యూట్యూబ్లో పెట్టారు. ఆయన పాట, ”కరోనా నీ నోట్లో దుమ్ముకొడతాం, నిను భారత భూభాగం నుండి తరిమికొడతాం” అంటూ సాగుతుంది.

”నాకు 27 ఏళ్ల పరిచయం. ఇద్దరం ఆర్టీసీలోనే పనిచేస్తాం. ఏ అంశంపై పాట రాసినా నాతో చర్చించేవాడు. కనీసం ఫోన్లో అయినా నాకు పాట వినిపించేవాడు. పది రోజుల క్రితమే కరోనాపై తను రాసిన పాటకు హిందీ అనువాదం చేసి, సవరణల కోసం నాకు పంపాడు. బెడ్ విషయంలో మాకు ఫోన్ చేసినా ఏదో ప్రయత్నం చేసే వాళ్లం. గాంధీకి ఒక రెండు మూడు గంటల ముందు వెళ్లి ఉండినా బావుండేదన్నారు దగ్గరనున్న వాళ్లు” అంటూ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ జాన‌ప‌ద గాయ‌కులు నిస్సార్ మృతి
0 votes, 0.00 avg. rating (0% score)