త‌మిళ‌నాడులో ఈ ఒక్క‌రోజే క‌రోనా కాటుకు ఎంత మందికి బ‌ల‌య్యారంటే?

July 12, 2020 at 8:22 pm

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో బెడ్ లు దొర‌క్క పేషంట్లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇటు ప్ర‌భుత్వాలు వైద్యులు అంద‌రూ కూడా చేతులెత్తేశారు. ఎవ్వ‌రూ ఏమీ చెయ్య‌లేని ప‌రిస్థితి నెల‌కొనింది. త‌మిళ‌నాడులో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఒక్కరోజే వేలాది కేసులు నమోదవుతున్నాయి. వైర‌స్ బారిన ప‌డి చ‌నిపోతున్న బాధితుల సంఖ్య‌ కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆదివారం నమోదైన కరోనా కేసులు ఆ రాష్ట్ర ప్రజలను భయాందోళనల‌కు గురిచేస్తున్నాయి. గ‌డిచిన 24గంటల్లో త‌మిళ‌నాడులో 68మంది కరోనాతో మరణించారు. కేసుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో న‌మోదైంది. ఆదివారం ఒక్క‌రోజే 4,244 మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. దీంతో అక్క‌డ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,470కు చేరింది.

ఇప్పటివరకు1,966 మంది కరోనాతో మరణించగా.. 46,969 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని అధికారులు తెలిపారు. దీంతో త‌మిళ‌నాడులో ఇప్ప‌టికే లాక్‌డౌన్ అమ‌లు లో ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ కేసులు మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం చాలా ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ప్రతి ఒక్క‌రూ మృత్యువుతో పోరాడుతున్నారు.

త‌మిళ‌నాడులో ఈ ఒక్క‌రోజే క‌రోనా కాటుకు ఎంత మందికి బ‌ల‌య్యారంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts