నాగ‌చైత‌న్య కెరీర్ బెస్ట్ ఇదేన‌ట‌?

July 1, 2020 at 9:32 pm

అక్కినేని నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా సెన్సిబుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న తాజా చిత్రం ల‌వ్ స్టోరి. ప్యాచ్ వ‌ర్క్ స‌హా 10 శాతం చిత్రీక‌రణ మాత్ర‌మే పెండింగ్. బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేసుకునేందుకు క‌మ్ముల బృందం సిద్ధ‌మ‌వుతోంది. అలాగే ద‌స‌రా నాటికి రిలీజ్ చేసేందుకు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నార‌ట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీ శాటిలైట్, డిజిట‌ల్ స‌హా డ‌బ్బింగ్ హ‌క్కుల్ని క‌లుపుకుని 18 కోట్ల మేర నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ పూర్తి చేసార‌ని తెలుస్తోంది. అలాగే థియేట్రిక‌ల్ రేంజ్ 25-30 కోట్ల మేర ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌జిలీ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన చైత‌న్య బ్యాక్ టు బ్యాక్ హిట్ల కోసం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. ల‌వ్ స్టోరీలో అత‌డి నైజాం యాస ఆక‌ట్టుకుంటుంద‌ని సాయి ప‌ల్ల‌వితో కెమిస్ట్రీ పెద్ద రేంజులోనే వ‌ర్క‌వుటైంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే నాన్ థియేట్రిక‌ల్ రేంజ్ పెరిగింద‌ట‌.

ఓవైపు ఈ మూవీని OTTలో విడుదల చేస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతున్నా.. నిర్మాత‌ల ఆలోచ‌న అలా లేద‌ని తెలిసింది. కాస్త ఆగితే థియేటర్లు తెరిచాక‌.. సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. చైత‌న్య రేంజుకు మించి బిజినెస్ అవుతోంది. అందుకే ఎవ‌రూ రాజీకి రావ‌డం లేద‌ట‌.

నాగ‌చైత‌న్య కెరీర్ బెస్ట్ ఇదేన‌ట‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts