నితిన్‌ పెళ్ళి డేట్‌ ఫిక్స్‌?

July 1, 2020 at 9:22 pm

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచలర్స్‌లో నితిన్ ఒకరు. హీరో నితిన్‌ పెళ్ళి ఎట్టకేలకు తను ప్రమించిన షాలినితో సెట్‌ అయింది. నిశ్చితార్దం కూడా అయి ఎట్టకేలకు మన హీరో ఓ ఇంటివాడు అయ్యాడు. తీరా పెళ్ళిచేసుకుందాం అనేసరికి కరోనా వచ్చిపడింది దీంతో పెళ్లి వాయిదా పడింది. తాను ప్రేమించిన షాలినిని ఆయన దుబాయ్‌లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కాని కరోనా కారణంగా హైదరాబాద్‌లోనే సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

చివరకు నితిన్ ఈ నెల 26న పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. వధూవరుల కుటుంబాలు కూడా ఈ ముహూర్తాన్నే నిశ్చయం చేసుకున్నట్లు సమాచారం. హైద‌రాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో వారి పెళ్లి జ‌రుగుతుంద‌ని సమాచారం. ప్రస్తుతం నితిన్ పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

నితిన్‌ పెళ్ళి డేట్‌ ఫిక్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)