నేనంటే నా రూటే సెప‌రేటు?

July 12, 2020 at 7:33 am

కరోనా మహమ్మారి దెబ్బకు మొదలైన సీరియల్ షూటింగ్ లు మళ్ళీ దేశవ్యాప్తంగా స్తంభించిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి సినీ లోకం నానా కష్టాలు పడాల్సి వస్తోంది. కాగా బాలయ్య – బోయపాటి సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయాల్సి ఉందని.. ఆ సీక్వెన్స్ లు కథకు చాలా కీలకమైనవి అని ఇటివలే మేము రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్కడే షూట్ చేయటానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట.

కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ షూటింగ్ చేయడం అసాధ్యం. అందుకే బోయపాటి ముందుగా వేరే సీన్స్ ను ఆగష్టు నుండి ప్లాన్ చేసి.. నవంబర్ నుండి వారణాసి మరియు హిమాలయాల సీన్స్ ను షూట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఏది ఏమైనా కరోనా ఎఫెక్ట్ బాలయ్య సినిమా పై బాగానే పడినట్టు కనిపిస్తోంది. కరోనా లేకపోయి ఉండి ఉంటే ఇప్పటికే బాలయ్య చాల భాగం షూటింగ్ ను పూర్తి చేసేవాడు. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు.

ఆ హీరోయిన్ ఎలా ఉండబోతుందో.. బాలయ్యకు ఎలా సూట్ అవుతుందో చూడాలి. ఇక తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణకు ‘సింహ’ రూపంలో ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ రూపంలో మరో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.

నేనంటే నా రూటే సెప‌రేటు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts