పెద్ద మనసు చాటుకున్న గవర్నర్

July 10, 2020 at 10:49 pm

గవర్నర్ తమిళిసై సుందర్ రాజన్ తన దయా హృదయాన్ని చాటుకున్నారు. నిత్యం బిజీ షెడ్యూల్లో ఉండే గవర్నర్ ఓ వ్యక్తికి వైద్యం అందేలా చూశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ డయాలసిస్ పేషెంట్ కు అండగా నిలిచారు. మహ్మద్ కలీమ్ ఉద్దీన్ హార్ట్ పేషెంట్. డయాలసిస్ చేయాల్సి ఉంది. అయితే డయాలసిస్ చేయించేందుకు అతని కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రిలో ఓపీకి ప్రయత్నించారు. సుమారు 7గంటల అవుతున్నా ఆస్పత్రి సిబ్బంది స్పందించలేదు. 7గంటల తరువాత ఆస్పత్రిలో బెడ్స్, ఆక్సీజన్ లేదని చెప్పడంతో ఆందోళనకు గురైన బాధితుడి కుటుంబ సభ్యుడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ కు ట్వీట్ చేశారు. బాధితుడి ట్వీట్ కు గవర్నర్ స్పందించారు. డయాలసిస్ పేషెంట్ కు ట్రీట్ మెంట్ అందించేలా తన ఉన్నతాధికారుల్ని ఆదేశించినట్లు, దగ్గరుండి ట్రీట్ మెంట్ కు ఏర్పాటు చేస్తారని రిప్లయ్ ఇచ్చారు.

పెద్ద మనసు చాటుకున్న గవర్నర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts