పెళ్ళి పై మంచి క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్‌

July 10, 2020 at 10:41 pm

రేణు దేశాయ్ రెండో పెళ్లి వ్య‌వ‌హారం ఇటీవ‌ల మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. రేణు ఎదురైన ప్ర‌తిచోటా ఈ ప్ర‌శ్న కంప‌ల్ స‌రీ అయిపోయింది. యూట్యూబ్ స‌హా ఈమీడియా.. సోష‌ల్ మీడియాల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన‌ప్పుడు `పెళ్లెప్పుడు?` అన్న ప్ర‌శ్న‌ను రేణు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. దానికి ఆన్స‌ర్ ఇవ్వ‌లేక నానా ఇబ్బందులు పడుతోంది.

ప్ర‌స్తుతం వార‌సులు అకీరా, ఆద్య‌ల‌తో రేణు హైద‌రాబాద్ లోనే నివాసం ఉంటున్నార‌న్న స‌మాచారం ఉంది. అలాగే బుల్లితెర రియాలిటీ షోల‌తోనూ రేణు బిజీ అవుతున్నారు. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల ప‌లు ఇంట‌ర్వ్యూల్లో రెండో పెళ్లిపై ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటిని తెలివిగా దాట‌వేసే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా ఓ ప్ర‌ముఖ మీడియా ఇంట‌ర్వ్యూలోనూ అదే తీరుగా ఎస్కేప్ అయ్యారు రేణు. ప్ర‌స్తుతం ఇలా చాలా సంతోషంగానే ఉన్నాను. ఆ విష‌యంపైనే ఎందుకు అంత ఆస‌క్తి? అంటూ యాంక‌ర్ ని క‌ట్ చేసేందుకు రేణు ట్రై చేసింది.

“పెళ్లి చేసుకున్నా కష్టమే, చేసుకోకపోయినా కష్టమే“ అంటూ విసుర్లు వేస్తూనే నాకు మంచి గిఫ్ట్ ఇస్తే ఆన్సర్ చేస్తానంటూ యాంక‌ర్ ని క‌న్ఫ్యూజ‌న్ లోకి నెట్టేశారు రేణు. అయినా ఎందుకీ ప్ర‌శ్న‌లు.. మీరు నా పెళ్లికి వచ్చేది లేదు.. చేసేది లేదు ఎందుకింత ఆసక్తి? అంటూ యాంకర్ నే అడిగేసారు. ఇవే ప్ర‌శ్న‌లు వేస్తే దానికి `పెళ్లి గోల` అనే టైటిల్ పెడతానని రేణు న‌వ్వేయ‌డం చూస్తుంటే అస‌లు ఆ మ్యాట‌ర్ లో ఎంత‌మాత్రం సీరియ‌స్ గా లేర‌ని అర్థ‌మ‌వుతోంది.

పెళ్ళి పై మంచి క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్‌
0 votes, 0.00 avg. rating (0% score)