ప‌వ‌న్ సినిమాల‌కి టైటిల్ గోలేంటో?

July 12, 2020 at 7:33 pm

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ హీరోగా 26 వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న‌ `వ‌కీల్ సాబ్` కు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స‌గం షూటింగ్ కూడా పూర్త‌యింది. అటుపై ప‌వ‌న్ తాత్క‌లికంగా కొద్ది రోజులు షూటింగ్ ఆపేసి పొలిటిక‌ల్ ప‌నుల్లో బిజీ అయ్యారు. ఈలోపు క‌రోనా వైర‌స్ కూడా రావ‌డంతో షూటింగ్ పూర్తిగా నిలిపివేయాల్సి వ‌చ్చింది. ఇక ఈ సినిమా టైటిల్ విష‌యంలో పెద్ద ఎత్తున యూనిట్ స‌హా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగిన సంగ‌తి తెలిసిందే. `వ‌కీల్ సాబ్`, `లాయ‌ర్ సాబ్` స‌హా చాలా టైటిల్స్ ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. చివ‌రికి ప‌వ‌న్ క‌ళ్యాణ్` వ‌కీల్ సాబ్ `కే ఫిక్స్ అయ్యారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న 27వ సినిమా టైటిల్ విష‌యంలోనూ మ‌రోసారి అలాంటి చ‌ర్చే జ‌రుగుతోంది. ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `విరూపాక్ష` అనే టైటిల్ కూడా జోరుగా వినిపిస్తోంది. అదే టైటిల్ గా ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ టైటిల్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత‌గా సూట్ కాలేదంట‌…టైటిల్ లో ప‌వ‌ర్ మిస్ అవుతుంద‌ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులు చెబుతున్నారు. `విరూపాక్ష` టైటిల్ కు బ‌ధులుగా `బందిపోటు`, `గ‌జ‌దొంగ` టైటిల్స్ లో ఏదో ఒక‌టి తీసుకుంటే బాగుంటుంద‌ని సూచిస్తున్నారు. ఆ విధంగా డైరెక్ట‌ర్ క్రిష్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్ పెడుతున్నారు.

మ‌రి ఈ రిక్వెస్ట్ ల‌ను యూనిట్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందా? విరూపాక్ష టైటిల్ తోనే ముందుకు వెళ్తారా? అన్న‌ది క్రిష్ క్లారిటీ ఇస్తే గాని తెలియ‌దు. అయితే విరూపాక్ష టైటిల్ ని ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. కేవలం ప్ర‌చారం మాత్రమే జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో అభిమానుల అభ్య‌ర్ధ‌న‌ల‌ను స్వీక‌రించే అవ‌కాశం ఉంద‌ని ఆశించ‌వ‌చ్చు. క‌రోనా గ‌నుక అడ్డు లేకపోయుంటే ఇప్ప‌టికే వకీల్ సాబ్ ప్రేక్ష‌కుల ముందుకు కూడా వ‌చ్చేసేది. ప‌వ‌న్ 27వ సినిమా కూడా ప్రారంభ‌మ‌య్యేది. ఈ రెండు సినిమాల త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ మ‌రో సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ సినిమాల‌కి టైటిల్ గోలేంటో?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts