ప‌వ‌ర్ స్టార్ మూవీ : గ‌డ్డితింటావా సాంగ్.. సారాంశం

July 19, 2020 at 7:39 pm

వివాదాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన వ‌ర్మ‌, ఈసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేసి, పీకే అభిమానుల‌తో నానా బూతులు తిట్టించుకుంటున్నాడు. అయితే వారిని లైట్ తీసుకున్న ఆర్జీవీ, ప‌వ‌ర్ స్టార్ సినిమాతో వీలైనంత ర‌చ్చ చేసి త‌న సినిమాను ఓ రేంజ్‌లో ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు.
ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.., అచ్చం పవన్ పోలికలున్న వ్య‌క్తిని పెట్టి, ఆయన పేరు ప్రవణ్ కళ్యాణ్ అంటూ ప‌రిచ‌యం చేసిన ఆర్జీవీ, టైటిల్ మధ్యలో జనసేన పార్టీ గుర్తు గ్లాస్ పెట్టడ‌మే కాకుండా, రష్యా భార్య, ఫాం హౌస్, ఎన్నికల తర్వాత అంటూ ప‌లు విష‌యాల్ని లింక్ చేస్తూ కావాల్సినంత వివాదం సృష్టించాడు. అయితే ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ మూవీ నుండి ఈ ఆదివారం గ‌డ్డి తింటావా సాంగ్ విడుద‌ల చేస్తాన‌ని, సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. చెప్పిన‌ట్లే సాయంత్రం 5 గంట‌ల‌కు గ‌డ్డి తింటావా సాంగ్‌ను విడుద‌ల చేశాడు వ‌ర్మ‌.

గ‌డ్డి తింటావా సాంగ్ విష‌యానికి వ‌స్తే.. ఫాంహౌస్ ఉన్న హీరో ప‌వ‌ర్ స్టార్ త‌న గేదెలు, మొక్క‌ల‌కు త‌న బాధ‌ను చెప్పుకుంటున్న‌ట్లు ఈ పాట‌ను తెర‌కెక్కించారు. ఎన్నిక‌ల త‌ర్వాత క‌థ అంటూ టైటిల్ లోనే అస‌లు విష‌యం చెప్పిన వ‌ర్మ‌, గ‌త ఎన్నిక‌ల నేప‌ధ్యంలో జ‌రిగిన విష‌యాల్ని జొప్పించి సెటైరిక‌ల్ ట‌చ్ ఇచ్చాడు. ఇక ఈ సాంగ్‌లో దేవుడ‌న్నాడొక‌డు ( బండ్ల గ‌ణేష్), డైలాగిచ్చాడొక‌డు (త్రివిక్ర‌మ్), నెత్తికెక్కించుకున్నా డొక‌డు (చంద్ర‌బాబు) అంద‌రూ క‌లిసి ముంచేశార‌ని, పులి లాంటోడిని, పిల్ల‌ని చేశార‌ని, ప‌వ‌ర్ స్టార్ బాధ‌ని ఆవిష్క‌రించాడు వ‌ర్మ‌.

ఇక మెగాస్టార్ చిరంజీవిని, ర‌ష్యా భార్యను కూడా చూపించిన వ‌ర్మ‌, ప‌వ‌ర్ ఇమ్మ‌ని కోరితే, స్టార్లు చూసించిన అభిమానులు అంటూ, ఎన్నిక‌ల టైమ్‌లో ప‌వ‌న్‌కు ఆయ‌న అభిమానులు హ్యాండ్ ఇచ్చిన విష‌యాన్ని కూడా ట‌చ్ చేశాడు. మొత్తం మీద ప‌వ‌ర్ స్టార్ ఎన్నిక‌ల త‌ర్వాత ప‌రిస్థితిని, అంటే ఆయ‌న బాధ‌ని ఈసాంగ్ ద్వారా చూపించాడు వ‌ర్మ‌. ఇక ఇప్ప‌టికే వ‌ర్మ పై గ‌ర‌మ్ గ‌ర‌మ్‌గా ఉన్న ప‌వ‌న్ అభిమానులు ఈసాంగ్ చూసిన త‌ర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. వాళ్ళు ఎంతలా రియాక్ట్ అయితే వ‌ర్మ మ‌రింత‌గా రెచ్చిపోవ‌డం మాత్రం ఖాయం. ఎందుకంటే వివాదాల‌తో క్యాష్ చేసుకోవ‌డం రామ్ ‌గోపాల్ వ‌ర్మ‌కి వెన్న‌తో పెట్టిన విద్య అనేది అంద‌రికీ తెలిసిందే. ఇక ప‌వ‌ర్ స్టార్ ట్రైల‌ర్‌ను జూల్ 22న విడుద‌ల చేస్తాన‌ని తెలిపిన వ‌ర్మ, ట్రైల‌ర్ చూడాలంటే 25 రూపాయ‌లు క‌ట్టాల‌ని కొత్త సాంప్ర‌దాయానికి తెర‌లేపాడు వ‌ర్మ‌. మ‌రి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి ప్ర‌కంప‌నలు సృష్టిస్తుందో చూడాలి.

ప‌వ‌ర్ స్టార్ మూవీ : గ‌డ్డితింటావా సాంగ్.. సారాంశం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts