బాలీవుడ్ లో మ‌రో విషాదం

July 12, 2020 at 7:19 pm

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖుల వరుస మరణాలు బీటౌన్ ఇండస్టీ‍ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ‌త మార్చి నెల ఆరంభం ద‌గ్గ‌ర నుంచి వ‌రుస‌గా సినీ ప్ర‌ముఖుల మ‌ర‌ణ వార్త‌లు వినాల్సి వ‌స్తోంది. తాజాగా మ‌రో బాలీవుడ్ న‌టుడు మృతి చెందాడు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న ప్ర‌ముఖ న‌టుడు రంజ‌న్ సెహ‌గాల్ (36) క‌న్ను మూసారు. చండీగ‌డ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్ మ‌రోసారి సోకానికి గురైంది. రంజ‌న్ మృతిప‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ముఖులంతా దిగ్ర్భాంతి వ్య‌క్తం చేసారు.

ర‌ణ‌దీప్ హూడా, ఐశ్వ‌ర్యారాయ్ లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన `స‌ర‌బ్ జీత్` సినిమాలో రంజ‌న్ న‌టించాడు. అలాగే` ఫోర్స్`, `క‌ర్మ‌, మ‌హి, ఎన్ ఆర్ ఐ వంటి సినిమాలు స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించారు. క్రైమ్ పెట్రోల్, సావ్ ధాన్ ఇండియా, తుమ్ దేనా సాత్ మేరా, భ‌వార్ వంటి సీరియ‌ల్స్ లోనూ రంజ‌న్ క‌నిపించారు. ఆ ర‌కంగా బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు రంజ‌న్ బాగా సుప‌రిచితుడయ్యారు. ప్ర‌స్తుతం అవ‌కాశాలు కూడా బాగానే వ‌స్తున్నాయి. కానీ ఇంత‌లోనే అనారోగ్యానికి గుర‌వ్వ‌డంతో జీవిత‌మే తారుమారైంది. రంజ‌న్ సెహ‌గాల్ సేవా కార్య‌క్ర‌మాల్లో కూడా చురుకుగా పాల్గొనే వారు. సంపాద‌న త‌క్కువే అయినా ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకోవ‌డానికి అంద‌రికంటే ముందు వ‌చ్చేవాడు. ఆయ‌న స‌హాయం పొందిన వారంతా రంజ‌న్ మ‌ర‌ణంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధించారు.

బాలీవుడ్ లో మ‌రో విషాదం
0 votes, 0.00 avg. rating (0% score)