మహేష్ సరికొత్త రికార్డు

July 2, 2020 at 9:10 pm

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా… అమ్మాయిల కలల రాకుమారుడు మహేష్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరుతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించి నెక్స్ ట్ ఫిల్మ్ కోసం రెఢీ అయిపోతున్నాడు. ఇంతకీ దర్శకుడు ఎవరంటే గీతగోవిందం పరుశురాం. సర్కారు వారి పాట టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి ఎమ్ బి ఎంటర్ టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సోషల్ మీడియాలో నిత్యం ఫ్యాన్స్ తో టచ్లో ఉండే మహేష్ తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ట్విట్టర్ లో మహేష్ బాబు ను ఏకంగా కోటిమంది ఫాలో అవుతున్నారు . సౌత్ ఇండియాలో ఏ స్టార్‌కి ఇంత ఫాలోయింగ్ లేదండోయ్. ఇంతటి ఘనత సాధించిన ఏకైన సౌత్ ఇండియా స్టార్ మహేష్ కావడం విశేషం. మహేష్ తన ట్విట్టర్‌లో సినిమా అప్‌డేట్స్‌తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్స్ కూడా తరచు ఇస్తుంటారు.

మహేష్ సరికొత్త రికార్డు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts