మిల్కీ బ్యూటీ డివోష‌న‌ల్ కి వెళ్ళిందా?

July 5, 2020 at 8:10 pm

మిల్కీ బ్యూటీ తమన్నా భక్తి బాటలో అడుగులు వేస్తోంద‌ట. ‘అవును మరి.. అవకాశాలు లేనప్పుడు అన్నీ అలాంటి ఆలోచనలే వస్తాయి’ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు, ఆమె సన్నిహితులు. తమన్నా అమ్మకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువట. అమ్మగారి సాయంతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన పెంచుకుంటోంద‌ట.

ఈ మధ్య తరచూ అమ్మతో కూర్చుని ఆధ్యాత్మిక గ్రంధాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందట. ఆ విధంగా భక్తి బాటలో అడుగులు వేస్తున్నానని చెబుతోంది తమన్నా. కొన్ని కారణాల వల్ల తన మాతృభాష సింధీ పై ఇప్పటి వరకు సరైన పట్టు సాధించలేకపోయిందట.

దక్షిణాది చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నందువల్ల తెలుగు, తమిళ భాషలను బాగానే మాట్లాడగలుగుతోంది. హిందీ కూడా వచ్చు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో సింధీ భాషను కూడా నేర్చుకుంటుందట. అమ్మగారితో ప్రస్తుతం ఆ భాషలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందిట. అదీ సంగతీ!?

మిల్కీ బ్యూటీ డివోష‌న‌ల్ కి వెళ్ళిందా?
0 votes, 0.00 avg. rating (0% score)