మెగా డాట‌రా..మ‌జాకా?

July 8, 2020 at 10:09 pm

మెగాడాట‌ర్ సుస్మిత కొణిదెల సినీనిర్మాత‌గా మారుతున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్ ‌మెంట్ అనే బ్యాన‌ర్ ని ప్రారంభించి ఇందులో ఓ వెబ్ సిరీస్ ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా సుస్మిత వెబ్ సిరీస్ కి క్లాప్ కొట్టి ప్రారంభించేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

అయితే సుస్మితకు ఈ రంగంలో అనుభ‌వం ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే.. ఇప్ప‌టికే ఖైదీ నంబ‌ర్ 150 .. సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ప‌ని చేసిన సుస్మిత ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల్ని చ‌క్క‌బెట్టార‌ని తెలుస్తోంది. ఆ అనుభ‌వంతోనే ఇప్పుడు ఈ డేర్ డెసిష‌న్ తీసుకున్నార‌ట‌.

ఓటీటీలో స‌క్సెసైతే త‌దుప‌రి సొంతంగా ఓటీటీనే ప్రారంభించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని చెబుతున్నారు. ఓటీటీలో మెగా యువ‌ హీరోల‌తో సినిమాలు తీయాల‌న్న ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌ట‌. అలాగే స్ట్రెయిట్ గా భారీ చిత్రాల్ని సుస్మిత నిర్మించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ట‌. సుస్మిత భ‌ర్త చెన్న‌య్ వాసి. కిడ్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే.

మెగా డాట‌రా..మ‌జాకా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts